ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరి హింసాకాండకు (Lakhimpur Kheri Violence) సంబంధించి మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
భాజపా కార్యకర్తలు ప్రయాణిస్తున్న వాహనం.. నలుగురు రైతులను ఢీకొనగా వారు చనిపోయిట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో కోపోద్రిక్తులైన రైతులు వాహనంలో ఉన్న కొందరిని చితకబాదారు. వారిలో ఇద్దరు భాజపా కార్యకర్తలు, డ్రైవర్ సహా మరో జర్నలిస్ట్ కూడా మృతి చెందారు.
ఈ కేసుకు సంబంధించి గుర్విందర్ సింగ్, విచిత్ర సింగ్ అనే ఇద్దరిని తాజాగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అరెస్టు చేసింది. ఈ నెల 4న సుమిత్ జైస్వాల్ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు... వారిని అరెస్ట్ చేసినట్లు ఓక ప్రకటనలో పేర్కొన్నారు.
ఆసుపత్రి నుంచి జైలుకు ఆషిశ్ మిశ్రా..
లఖింపుర్ ఖేరి ఘటనలో ప్రధాన నిందితునిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా (Ajay Mishra Lakhimpur) కుమారుడు ఆశిష్ మిశ్రాను (Ashish Mishra Lakhimpur) అధికారుల తిరిగి జైలుకు తరలించారు. డెంగీ బారిన పడిన ఆయనను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించిన అధికారులు.. ఆరోగ్య పరిస్థితి మెరుగు పడడంతో తిరిగి జిల్లా జైలుకు తరలించినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ చేస్తున్న వాంఖడే: మంత్రి మాలిక్