హిమాచల్ ప్రదేశ్ లాహౌల్ వ్యాలీని మంచు దుప్పటి కప్పేసింది. హిమపాతం మధ్య అటల్ సొరంగ మార్గం, సిస్సు సరస్సును తిలకించేందుకు వేల సంఖ్యలో పర్యటకులు వస్తున్నారు. ఎటు చూసినా శ్వేత వర్ణంతో స్వర్గధామంలా కనిపిస్తున్న లోయ అందాలను తనివితీరా ఆస్వాదిస్తున్నారు.
పర్యటకుల తాకిడితో అక్కడి హోటళ్లు, షాపింగ్ మాల్స్ తెరుచుకున్నాయి.