కేంద్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్న నేపథ్యంలో.. కేబినెట్ నుంచి పలువురు మంత్రులు వైదొలిగారు.
- కేంద్ర మంత్రి పదవికి సంతోశ్ గంగవార్ రాజీనామా చేశారు. ప్రస్తుతం మోదీ క్యాబినెట్లో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సంతోశ్ గంగవార్ మంత్రి పదవి నుంచి వైదొలుగుతున్న ప్రకటించారు.
- రమేశ్ పోఖ్రియాల్ కూడా రాజీనామా చేశారు. ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆయన పలు అనారోగ్య కారణాలతో పదవి నుంచి తప్పుకున్నట్లు వెల్లడించారు.
- కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు సదానందగౌడ. ప్రస్తుతం ఎరువులు, రసాయనాల శాఖ మంత్రిగా ఉన్నారు.
- కేంద్ర మంత్రి పదవికి హర్షవర్ధన్ రాజీనామా చేశారు. ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు హర్షవర్ధన్.
- సంజయ్ దోత్రే.. కేంద్ర మంత్రి పదవి నుంచి వైదొలిగారు.
- కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో తన పదవికి రాజీనామా చేశారు.