ETV Bharat / bharat

పని చేయించుకుని డబ్బులు ఇవ్వలేదని కూలీ ఆగ్రహం- బెంజ్ కారుకు నిప్పు - యజమాని కారుకు నిప్పు

ఇంటి బయట పార్క్ చేసి ఉన్న మెర్సిడెజ్ బెంజ్ కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ వ్యక్తి. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా అతడ్ని పోలీసులు అరెస్టు చేశారు. తనతో టైల్స్ పని చేయించుకుని, డబ్బులు ఇవ్వనందునే ఇలా చేసినట్లు ఆ వ్యక్తి చెప్పాడు.

Laborer set fire to Mercedes
బెంజ్​ కారుకు నిప్పంటిస్తున్న దృశ్యం
author img

By

Published : Sep 14, 2022, 3:25 PM IST

Updated : Sep 14, 2022, 4:55 PM IST

పని చేయించుకుని డబ్బులు ఇవ్వలేదని కూలీ ఆగ్రహం- బెంజ్ కారుకు నిప్పు

పని చేయించుకుని డబ్బులు ఇవ్వడం లేదన్న కోపంతో యజమానికి చెందిన ఖరీదైన కారును తగలబెట్టాడు ఓ వ్యక్తి. ఈ ఘటన నొయిడా సెక్టార్​-39లోని సదర్​పుర్​ కాలనీలో మంగళవారం జరిగింది.
బిస్​రఖ్​ ఠాణా పరిధిలోని జలాల్​పుర్​ గ్రామానికి చెందిన రణ్​వీర్​.. నొయిడాలోని సదర్​పుర్​ కాలనీకి చెందిన ఆయుష్ చౌహాన్​ ఇంట్లో టైల్స్ పని చేశాడు. ఇందుకు సంబంధించి రణ్​వీర్​కు ఆయుష్​ రూ.68వేలు ఇవ్వాల్సి ఉంది. అనేక సార్లు రణ్​వీర్​ వచ్చి అడిగినా ఆయుష్​ డబ్బులు ఇవ్వలేదు.

Laborer set fire to Mercedes
బెంజ్​ కారుకు నిప్పంటిస్తున్న దృశ్యం
Laborer set fire to Mercedes
బెంజ్​ కారుకు నిప్పంటిస్తున్న దృశ్యం

ఆయుష్​ తీరుతో విసిగిపోయిన రణ్​వీర్​.. మంగళవారం బైక్​పై సదర్​పుర్​ కాలనీకి బైక్​పై వచ్చాడు. ఇంటి ముందు పార్క్​ చేసి ఉన్న మెర్సిడెజ్ బెంజ్ కారుపై పెట్రోల్ పోసి, నిప్పంటించి.. పారిపోయాడు. అయితే.. ఈ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా పోలీసులు రణ్​వీర్​ను అరెస్టు చేశారు.

ఇవీ చదవండి: ఏడో అంతస్తు నుంచి పడిన లిఫ్ట్- 8 మంది కూలీలు దుర్మరణం

210 నిమిషాలు ఆగిపోయిన గుండె.. వైద్యుల అరుదైన సర్జరీ.. చివరకు..!

Last Updated : Sep 14, 2022, 4:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.