Kupwara Encounter : జమ్ము కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా ఉగ్రముఠాకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. కుప్వారా జిల్లాలోని మచిల్ సెక్టార్‌లో మొదట చొరబాటుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చినట్లు బలగాలు తెలిపాయి. ఆ తర్వాత మరోసారి జరిగిన కాల్పుల్లో మరో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని వెల్లడించాయి. మృతి చెందిన ఉగ్రవాదులంతా లష్కరే తోయిబా ఉగ్రముఠాకు చెందినవారిగా గుర్తించినట్లు పేర్కొన్నాయి.
-
#KupwaraEncounterUpdate: Three (03) more #terrorists of LeT killed (Total 05). Identification being ascertained. Search #operation in progress. Further details shall follow: ADGP Kashmir@JmuKmrPolice https://t.co/qOMWE0M3uh
— Kashmir Zone Police (@KashmirPolice) October 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#KupwaraEncounterUpdate: Three (03) more #terrorists of LeT killed (Total 05). Identification being ascertained. Search #operation in progress. Further details shall follow: ADGP Kashmir@JmuKmrPolice https://t.co/qOMWE0M3uh
— Kashmir Zone Police (@KashmirPolice) October 26, 2023#KupwaraEncounterUpdate: Three (03) more #terrorists of LeT killed (Total 05). Identification being ascertained. Search #operation in progress. Further details shall follow: ADGP Kashmir@JmuKmrPolice https://t.co/qOMWE0M3uh
— Kashmir Zone Police (@KashmirPolice) October 26, 2023
గురువారం పోలీసులతో కలిసి కౌంటర్ ఇన్‌ఫిల్ట్రేషన్ ఆపరేషన్‌ను సైన్యం చేపట్టింది. నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సైన్యం తెలిపింది. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల చొరబాటు నిరోధక ఆపరేషన్లలో పోలీసు బలగాల్ని సైతం వినియోగిస్తున్నారు. కశ్మీర్‌కు చెందిన పోలీసులు, సెక్యూరిటీ ఏజెన్సీలు శ్రీనగర్‌లోని 15 కార్ప్స్‌లో బుధవారం భేటీ అయ్యారు. ఈ ఏడాది 46 మంది ఉగ్రవాదులు హతమవ్వగా.. వారిలో 37మంది పాకిస్థానీలు కాగా.. 9 మంది స్థానికంగా ఉన్నవారేనని ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి.
-
OP KUPWARA
— Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) October 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
In a Joint Operation launched by #IndianArmy, @JmuKmrPolice & Intelligence agencies on 26 Oct 23, an infiltration bid has been foiled by alert troops along the #LoC in #Kupwara sector.
Operations in progress. #Kashmir@adgpi@NorthernComd_IA pic.twitter.com/rHnO4EHMqP
">OP KUPWARA
— Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) October 26, 2023
In a Joint Operation launched by #IndianArmy, @JmuKmrPolice & Intelligence agencies on 26 Oct 23, an infiltration bid has been foiled by alert troops along the #LoC in #Kupwara sector.
Operations in progress. #Kashmir@adgpi@NorthernComd_IA pic.twitter.com/rHnO4EHMqPOP KUPWARA
— Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) October 26, 2023
In a Joint Operation launched by #IndianArmy, @JmuKmrPolice & Intelligence agencies on 26 Oct 23, an infiltration bid has been foiled by alert troops along the #LoC in #Kupwara sector.
Operations in progress. #Kashmir@adgpi@NorthernComd_IA pic.twitter.com/rHnO4EHMqP
Jammu Kashmir Encounter Today : అంతకుముందు సోమవారం జమ్ముకశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఈ క్రమంలో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఘటనాస్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడమే కాకుండా వాతావరణం ప్రతికూలంగా ఉండడం వల్ల నియంత్రణ రేఖ మీదుగా భారీగా ఆయుధాలతో ఉగ్రవాదుల బృందం చొరబాటుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న భద్రతా దళాలు అక్కడి చేరుకొని వారిని నిలువరించేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు, బలగాలకు మధ్య కాల్పులు జరిగినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని.. మిగతా ఉగ్రవాదులు వారి మృతదేహాలను తీసుకొని అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారని పేర్కొన్నారు. ఘటనాస్థలం నుంచి రెండు ఏకే రైఫిళ్లు, నాలుగు చైనీస్ గ్రానైడ్లు, ఆరు పిస్తోళ్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
కశ్మీర్లో రెచ్చిపోయిన ముష్కరులు.. ముగ్గురు సైనికులు వీర మరణం
Baramulla Encounter : ఉగ్రవాదుల కోసం ఆర్మీ స్పెషల్ ఆపరేషన్.. ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ముష్కరులు హతం