ప్రతిసారి దాదాపు మూడు నెలలు పాటు జరిగే కుంభమేళాను కరోనా విజృంభణ దృష్ట్యా చరిత్రలో తొలిసారిగా నెల రోజులు మాత్రమే నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
భక్తులంతా మూడు రోజుల ముందే కరోనా పరీక్ష చేయించుకోవాలని ఉత్తరాఖండ్ హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. కరోనా టీకా తీసుకున్నవారు సంబంధిత ధ్రువపత్రాన్ని ప్రభుత్వ అధికారిక పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని తెలిపింది.
గంగా ఒడ్డున 12 ఏళ్లకోసారి జరిగే కుంభమేళా.. జనవరి-ఏప్రిల్ మధ్య(సుమారు మూడు నెలలు) నిర్వహిస్తారు. అయితే ఈసారి ఏప్రిల్ 1 నుంచి 30 వరకు మాత్రమే జరగనుంది. 'షాహీ స్నాన్'గా పిలిచే భక్తుల పుణ్యస్నానాల కార్యక్రమం ఏప్రిల్ 12, 14, 27 తేదీల్లో ఉండనుంది. ఈ మూడు రోజులు వేలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
చివరిసారిగా కుంభమేళాను 2010లో జనవరి 14-ఏప్రిల్ 28 మధ్య నిర్వహించారు.
ఇదీ చదవండి: లాక్డౌన్కు ఏడాది- కరోనా కట్టడిలో ఎక్కడున్నాం?