ETV Bharat / bharat

Krishnashtami Quotes and Wishes 2023 : మీ ఇంటికి చిన్ని కృష్ణుడు వచ్చేస్తున్నాడు.. జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా.. - Krishna Janmashtami 2023 Messages Telugu

Krishnashtami 2023 Quotes and Wishes in Telugu : కృష్టాష్టమి వచ్చేసింది. బుజ్జి కృష్ణుడు బుడి బుడి అడుగులు వేస్తూ.. మిమ్మల్ని మురిపించేందుకు మీ ముంగిట వచ్చేస్తున్నాడు. మరి, వేడుకలకు మీరంతా సిద్ధంగా ఉన్నారా? ఈ శుభవేళ.. "ఈటీవీ భారత్" అందిస్తున్న స్పెషల్ కోట్స్, ఇంకా వాట్సాప్ స్టేటస్​ల ద్వారా.. బంధుమిత్రులందరికీ శుభాకాంక్షలు చెప్పండి.

Krishnashtami Quotes and Wishes in Telugu
Krishnashtami 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 6, 2023, 2:10 PM IST

Krishnashtami 2023 Special Quotes and Wishes in Telugu: "కృష్ణం వందే జగద్గురం.. వందే కృష్ణం జగద్గురం".. ఈ ఏడాది కృష్ణాష్టమి గడియలు వచ్చేశాయి. శ్రావణ మాసం కృష్ణ పక్షం అష్టమి తిథి రోహిణి నక్షత్రంలో జన్మించిన రోజునే పండుగ జరుపుకుంటాం. కృష్ణాష్టమినే.. గోకులాష్టమి, అష్టమి రోహిణి, కృష్ణ జన్మాష్టమి అని రకరకాల పేర్లతో పిలుస్తారు. మన అల్లరి కన్నయ్యకు.. చాలా పేర్లే ఉన్నాయి. దేవకీ సుతుడూ, యశోదా నందనుడంటే.. అందరికీ వల్లమాలిన అభిమానమే. చిటికెన వేలుతో గోవర్థన గిరిని ఎత్తిన కన్నయ్య అంటే విపరీతమైన ప్రేమ.

అలాంటి కన్నయ్య తన మధురామృత ధారల్ని తమ ఇంటా కురిపించాలని.. రారా కృష్ణయ్య.. అంటూ గానమృతం చేస్తూ.. ఇంటి లోపలికి ఆహ్వానిస్తూ.. ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తారు. దేవకీ వసుదేవులకు ఎనిమిదో సంతానంగా చెరసాలలో పుట్టాడు కృష్ణుడు. కంసుడిని అంతం చేయడానికే ద్వాపర యుగంలో జన్మించాడని నానుడి.

మరి, లోక కల్యాణం కోసం అవతరించాడని భావించే.. శ్రీ కృష్ణుడి జన్మదినాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఇళ్లల్లో వేడుకలు సరే.. మిత్రులకు ఎలాంటి శుభాకాంక్షలు చెబుతున్నారు..? సింగిల్ వర్డ్​లో కాకుండా.. శ్రీకృష్ణుడు చెప్పిన జీవిత పరమార్థాన్ని వల్లెవేస్తూ.. మీ స్నేహితులకు, బంధువులకు.. శుభాకాంక్షలు చెప్పండి. భక్తిభావాన్ని ప్రతిబింబించే శ్లోకాలు, సందేశాలను వాట్సాప్​, ఫేస్​బుక్​ ద్వారా షేర్ చేయండి.

Krishnashtami 2023 Quotations Telugu:

''చావు, పుట్టుకలు సహజం.. ఎవరూ దాన్ని తప్పించలేరు.. అందువల్ల వివేకవంతులు వాటి గురించి ఆలోచించరు." అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి..

''నీకు నీవే ఆప్తుడివి.. నీకు నీవే శత్రువువి.. నీకు నీవే ఇచ్చుకుంటే.. నీకు నీవే అధిపతివి.."

"కృష్ణ కృష్ణ మహాకృష్ణ.. సర్వజ్ఞత్వం ప్రసీద మే.. రమారమణ విద్యేశ విద్యామాశు ప్రయచ్ఛ మే.."

"మేఘం తొలగిపోయాక అక్కడే ఉన్న సూర్యుడిని చూసినట్లు.. అజ్ఞానం అంతరించిన తర్వాతే జ్ఞానం గోచరిస్తుంది"..

"నందపుత్రాయ.. శ్యామలాంగాయ.. బాలవపుషే కృష్ణాయ గోవిందాయ.. గోపీజనవల్లభాయ స్వాహా"

"హ్రీం క్లీం శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ శ్రీం శ్రీం శ్రీ.."

"నమో భగవతే నందపుత్రాయ ఆనందవపుషే గోపీజనవల్లభాయ స్వాహా.."

"వసుదేవ సుతం దేవం కంస చాణుర మర్ధనమ్​ దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్"..

"యోగమంటే ఇంకేమీ కాదు.. నీ కర్తవ్యాన్ని నీవు నైపుణ్యంగా నిర్వర్తించడమే.."

"మనిషిని సరైన దారిలోకి మళ్లించి.. కార్మ్యోన్ముఖుడిని చేసే అంతరాత్మే ప్రతి ఒక్కరికి ముఖ్యం"

"నీ బాధ్యత మాత్రమే నీవు నిర్వర్తించు.. అంతవరకు మాత్రమే నీకు అధికారం ఉంది. ఫలితం గురించి ఆలోచించకు.. అది నీ పని కాదు"..

Krishna Janmashtami 2023 Messages Telugu :

"మీ కష్టాలు తొలగిపోవాలి. ఆనందం వెల్లివిరియాలి. ఆ కృష్ణుడి దీవెనలు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ.. కృష్ణాష్టమి శుభాకాంక్షలు."

"కన్నయ్య లీలలు వర్ణనాతీతం. ఆ పరమాత్ముడి గీతాసారం అనుసరణీయం. జన్మాష్టమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు."

"ఆ నీల మేఘ శ్యాముడి జన్మదినం నాడు మీ ఇంట సుఖసంతోషాలు వెల్లివిరియాలని.. ఆ కృష్ణభగవానుడు మీకు ఆయుఃరారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నా"

"కృష్ణాష్టమి అంటేనే ఆనందం, సంతోషం, ప్రేమమయం. అందరికీ ఉట్టి కొట్టే పండుగ శుభాకాంక్షలు."

"వెన్నదొంగ మీ కష్టాలను దొంగిలించాలని.. మిమ్మల్ని తియ్యటి వెన్నతో ఆశీర్వదించాలని కోరుకుంటూ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

Krishnashtami 2023 Sep 6th or 7th ? : శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు.. సెప్టెంబర్​ 6నా..? 7వ తేదీనా..?

వైభవంగా కృష్ణాష్టమి సంబరాలు.. అలరించిన ఉట్టి వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.