ETV Bharat / bharat

పతంగి నింపిన విషాదం - మాంజా చుట్టుకుని జవాన్, గాలిపటం ఎగరేస్తూ మరో నలుగురి మృతి - ASI Son Died while Flying a Kite

Kite Tragedies in Telangana : పండుగ అంటే సంతోషాన్నిచ్చేది. కానీ ఈ సంక్రాంతి మాత్రం కొందరికి తీరని శోకాన్ని మిగిల్చింది. గాల్లోకి పతంగులు ఎగరేస్తూ కొందరు, ఎవరో చేసిన పాపానికి మాంజా దారంతో గొంతు తెగి ఓ జవాను మరణించారు. ఆనంద హేలతో నవ్వులు పూయాల్సిన ఇళ్లలో పండుగ రోజున విషాద ఛాయలు అలుముకున్నాయి.

Jawan Died with China Manja wrapped Around Neck
Kite Tragedies in Telangana
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 14, 2024, 8:00 PM IST

Updated : Jan 14, 2024, 9:36 PM IST

Kite Tragedies in Telangana : పండుగను ప్రశాంతంగా చేసుకుందామని పతంగులు తెచ్చుకుని ఎగరేద్దామని సిద్ధమయ్యారు. కానీ, పతంగుల పండుగను ఆస్వాదించకుండానే అనంతలోకాలకు పయనమయ్యారు. పండుగ కోలహలం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 5 మంది ప్రాణాలు వదిలారు. గాలిపటాలను ఎగరేసే క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పలువురు మృతి చెందారు.

ప్రాణం తీసిన ప్రేమ - మామాఅల్లుడిపై దాడి ఘటన, తండ్రి, కుమారుడి అరెస్టు

Jawan Died with China Manja wrapped Around Neck : హైదరాబాద్‌ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. కోటేశ్వర్‌ రెడ్డి అనే ఓ ఆర్మీ జవాను శనివారం రాత్రి విధులకు వెళ్లే సమయంలో లంగర్ హౌస్​ ఫ్లై ఓవర్ పైన చైనీస్ మాంజా మెడకు చుట్టుకుని కింద పడిపోయాడు. వెంటనే పక్కనే ఉన్న ఆర్మీ హాస్పటల్‌కు తరలించి చికిత్స ఇస్తున్న సమయంలోనే తుది శ్వాస విడిచినట్లు పోలీసులు తెలిపారు.

విశాఖపట్నంకు చెందిన ఆర్మీ జవాన్ కోటేశ్వర్‌ రెడ్డి ప్రస్తుతం లంగర్ హౌస్​లో అద్దెకు ఉంటూ విధులకు వెళ్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి శవపరీక్ష నిర్వహించారు. అనంతరం తిరిగి మృతదేహాన్ని ఆర్మీ అధికారులకు అప్పగించారు. ఆదివారం ఉదయం సైనిక లాంఛనాలతో కోటీశ్వర్‌ రెడ్డి మృతదేహాన్ని స్వస్థలమైన విశాఖపట్నం పోలీసులకు పంపించారు.

Jawan Died with China Manja wrapped Around Neck
మృతుడు కోటేశ్వర్‌ రెడ్డి

ASI Son Died while Flying a Kite in Petbasheerabad : మరో ఘటనలో గాలిపటం ఎగరేస్తూ ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కిందపడి యువకుడు మృతి చెందిన ఘటన పేట్​ బషీరాబాద్​లో చోటుచేసుకుంది. మృతి చెందిన యువకుడు అల్వాల్​ ఏఎస్సై రాజశేఖర్​ కుమారుడు ఆకాశ్​గా గుర్తించారు. నాగోల్‌లోనూ 8వ తరగతి చదువుతున్న శివప్రసన్న నాలుగంతస్తుల మేడపై నుంచి ప్రాణాలు విడిచాడు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో జోహెల్‌ అనే 12 ఏళ్ల బాలుడు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు.

ASI Son Died while Flying a Kite in Petbasheerabad
మృతుడు ఆకాశ్

Man dead in Jogipet while Flying Kite : సంగారెడ్డి జిల్లా ఆంధోల్ మండలం జోగిపేటలో విషాదం చోటు చేసుకుంది. పిల్లలతో కలిసి గాలిపటం ఎగరేస్తుండగా విద్యుత్తు తీగలకు చిక్కుకోవడంతో తీసేందుకు యత్నించి కరెంట్ షాక్​కు గురై భవనం పైనుంచి కిందపడి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి మరణించాడు. భవనంపై నుంచి కిందపడి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు సుబ్రహ్మణ్యం స్వస్థలం కృష్ణా జిల్లా కొరగంటి పాలెం. సంక్రాంతి పండుగ కోసం జోగిపేటలోని అత్తగారింటికి కుటుంబ సభ్యులతో వచ్చాడు.

Man dead in Jogipet while Flying Kite
మృతుడు సుబ్రహ్మణ్యం

బ్రేకులు ఫెయిల్, పొదల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు - తప్పిన పెను ప్రమాదం

Last Updated : Jan 14, 2024, 9:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.