ETV Bharat / bharat

Kishan Reddy Latest News : 'ప్రధాని పర్యటన తర్వాత రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపడతాను'

Kishan Reddy Responds on BJP State President : కేంద్రమంత్రి కిషన్​రెడ్డి తనను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమించాక తొలిసారి స్పందించారు. కేంద్ర మంత్రి స్థానానికి సంబంధించి అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా.. దానికి కట్టుబడి ఉంటానన్నారు. అదేవిధంగా జులై 8న వరంగల్‌లో ప్రధాని మోదీ సభ తర్వాత అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కేంద్రమంత్రి వర్గ సమావేశానికి కిషన్​రెడ్డి హాజరుకాలేదు. కేబినేట్ భేటీకి వెళ్లకుండా దిల్లీలోని తన నివాసంలో ఆయన ఉన్నారు. మరోవైపు కిషన్​రెడ్డి సాయంత్రం హైదరాబాద్​ రానున్నారు.

Kishan Reddy
Kishan Reddy
author img

By

Published : Jul 5, 2023, 1:28 PM IST

Updated : Jul 5, 2023, 3:19 PM IST

Kishan Reddy Responds on Telangana BJP State President : బీజేపీ తెలంగాణ చీఫ్‌గా బాధ్యతలు ప్రకటించిన తర్వాత.. తొలిసారి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి స్పందించారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. 'నేను పార్టీకి విధేయుడిని. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను. అధిష్ఠానం నిర్ణయం మేరకు ముందుకు సాగుతా. జులై 8న వరంగల్‌లో ప్రధాని మోదీ సభ తర్వాత అధ్యక్ష బాధ్యతలు చేపడతాను. కేంద్ర మంత్రి స్థానానికి సంబంధించి అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా.. దానికి కట్టుబడి ఉంటా' అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Kishan Reddy absent Union Ministers meeting : మరోవైపు దిల్లీ కేంద్రమంత్రి వర్గ భేటీ జరుగుతోంది. ఈ సమావేశానికి కేంద్రమంత్రి కిషన్​రెడ్డి గైర్హాజరయ్యారు. కేబినేట్ సమావేశానికి వెళ్లకుండా దిల్లీలోని తన నివాసంలో కిషన్​రెడ్డి ఉండిపోయారు. మరోవైపు ఆయన సాయంత్రం హైదరాబాద్​ రానున్నారు. అందుబాటులో ఉన్న పార్టీ పార్టీ పదాధికారులు.. అధికార ప్రతినిధులు జాతీయ కార్యవర్గ సభ్యులు ముఖ్య నేతలతో సాయంత్రం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలోనే మోదీ పర్యటనపైన సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే రేపు ఉదయం వరంగల్​కు వెళ్లనున్న కిషన్​రెడ్డి.. ఎనిమిదో తేదీ వరకు అక్కడే ఉండనున్నారు.

రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడి మార్పుపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడిన విషయం తెలిసిందే. జాతీయ నాయకత్వం తెలంగాణ అధ్యక్షుడిని మారుస్తూ నిర్ణయం తీసుకుంది. బండి సంజయ్ స్థానంలో.. కేంద్రమంత్రి కిషన్​రెడ్డిని కొత్తసారథిగా నియమించింది. త్వరలో పలు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కమలదళం సంస్థాగత మార్పులు చేపట్టిం. అయితే రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం పట్ల కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ఇంతవరకూ స్పందించలేదు. మీడియా ప్రతినిధులు చుట్టు ముట్టి ప్రశ్నలు సంధించినా మౌనంగా వెళ్లిపోయారు.. తప్పితే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ క్రమంలోనే ఆయన కేంద్రమంత్రి వర్గ సమావేశానికి హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

Kishan Reddy Latest News : మరోవైపు నేతల మధ్య సమన్వయమే ధ్యేయంగా ఈటల రాజేందర్‌కు భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం.. ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా నియమించింది. హుజురాబాద్‌ ఎన్నికలో విజయం సాధించిన తర్వాత ఈటల సేవలను ఉపయోగించుకోవడంపై కొన్ని నెలలుగా పార్టీలో చర్చ జరుగుతోంది. బీజేపీ అధ్యక్ష పదవి సహా ఇతర కీలక పదవుల అంశం చర్చకు వచ్చింది. ఎన్నికల నిర్వహణ బాధ్యతలు అప్పగించడం ద్వారా ప్రయోజనం ఉంటుందని భావించిన దిల్లీ నాయకులు.. రాష్ట్ర బీజేపీలో తొలిసారి ఎన్నికల నిర్వహణ కమిటీ ఏర్పాటు చేసి దీనికి ఛైర్మన్‌గా ఈటలను ప్రకటించారు.

పార్టీ అగ్ర నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని.. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తనను తప్పించడం పట్ల బండి సంజయ్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. పార్టీ అవసరాల మేరకే మారుస్తున్నామని జాతీయ అధ్యక్షుడు నడ్డా చెప్పినట్లు సమాచారం.

ఇవీ చదవండి:

Last Updated : Jul 5, 2023, 3:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.