Kishan Bagaria Dibrugarh Texts App : అసోం.. డిబ్రూగఢ్‌కు చెందిన ఓ కుర్రాడు అరుదైన ఘనత సాధించి వార్తల్లో నిలిచాడు. అతడు రూపొందించిన ఆల్ ఇన్ వన్ మెసేజింగ్ యాప్‌ను అమెరికా దిగ్గజ టెక్ కంపెనీ రూ.416 కోట్ల(50 మిలియన్ డాలర్లు)కు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో యూఎస్ నుంచి బుధవారం డిబ్రూగఢ్‌కు చేరుకున్న ఆ యువకుడికి.. అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఘన స్వాగతం పలికారు.
డిబ్రూగఢ్‌లోని చారియాలీ ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త మహేంద్ర బగారియా, నమీతా బగారియా కుమారుడు కిషన్ బగారియా పైచదువుల కోసం అమెరికా వెళ్లాడు. అయితే చిన్నప్పటి నుంచి ఏదైనా వినూత్నంగా చేయాలనే తపన ఉన్న కిషన్.. 'texts.com' అనే ఆల్ ఇన్ వన్ ఆన్లైన్ మెసేజింగ్ యాప్‌ను తయారుచేశాడు. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, మెసెంజర్, వాట్సాప్ వంటి యాప్‌లలో ఉన్న కాంటాక్ట్స్‌తో ఈ యాప్‌ను ఉపయోగించి మెసేజ్‌లు చేసుకోవచ్చు. యువతకు ఈ యాప్ నచ్చడం వల్ల 'texts.com' సక్సెస్ అయింది.
అయితే ఆ యాప్‌ను రూ.416 కోట్లకు కొనుగోలు చేసింది అమెరికా టెక్ దిగ్గజం 'ఆటోమేటిక్' (Automattic) సంస్థ. దీంతో ఒక్కసారిగా కిషన్.. కోటీశ్వరుడిగా మారిపోయాడు. అంతేకాకుండా.. texts.com కార్యకలాపాల బాధ్యతలు కూడా చేపట్టాల్సిందిగా కిషన్‌ను కోరింది ఆటోమేటిక్ సంస్థ. అయితే wordpress.com, Tumblr వంటి ప్రముఖ సంస్థల వ్యవస్థాపకుడు మాట్ ముల్లెన్‌వెగ్ (Matt Mullenweg).. 'ఆటోమేటిక్' యజమాని కావడం గమనార్హం.
'కష్టానికి ఫలితమిది.. వారి వల్లే విజయం'
దాదాపు 9 నెలల తర్వాత బుధవారం భారత్‌కు చేరుకున్న కిషన్ బగారియా.. ఈ విజయం తన కష్టానికి ఫలితమని చెప్పాడు. తన తల్లిదండ్రులు, దేవుడి ఆశీర్వాదం వల్లే విజయం సాధించానని తెలిపాడు. చిన్నవయసులోనే అరుదైన ఘనత సాధించి కుటుంబాన్ని, రాష్ట్రాన్ని గర్వపడేలా చేశాడని అతడి బంధువులు చెబుతున్నారు.
-
excited to announce https://t.co/VnglkebPRv is now part of @Automattic (the company behind @WordPressDotCom @Tumblr @DayOneApp @PocketCasts @WooCommerce)
— Kishan Bagaria (@KishanBagaria) October 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
if you’re a user, nothing changes for you. expect more features and mobile apps sooner pic.twitter.com/bu6x7cFv58
">excited to announce https://t.co/VnglkebPRv is now part of @Automattic (the company behind @WordPressDotCom @Tumblr @DayOneApp @PocketCasts @WooCommerce)
— Kishan Bagaria (@KishanBagaria) October 24, 2023
if you’re a user, nothing changes for you. expect more features and mobile apps sooner pic.twitter.com/bu6x7cFv58excited to announce https://t.co/VnglkebPRv is now part of @Automattic (the company behind @WordPressDotCom @Tumblr @DayOneApp @PocketCasts @WooCommerce)
— Kishan Bagaria (@KishanBagaria) October 24, 2023
if you’re a user, nothing changes for you. expect more features and mobile apps sooner pic.twitter.com/bu6x7cFv58
వ్యర్థాలతో ఎఫ్1 రేసింగ్ కారు..
కొన్ని రోజుల క్రితం.. వాహనాలు తయారు చేయాలనే సంకల్పంతో ఓ యువకుడు ఏకంగా స్పోర్ట్స్ కారునే రూపొందించాడు. మహారాష్ట్రకు చెందిన స్వప్నిల్ అనే యువకుడు.. కారు, బైక్ వ్యర్థాలతో ఫార్ములా వన్ రేసింగ్‌కు తగినట్లుగా వాహనాన్ని తయారుచేసి రోడ్ల మీద పరుగులు పెట్టించాడు. ఆ యువకుడి ప్రయత్నం చూసి ఆశ్చర్యపోవడం స్థానికుల వంతైంది. అతడు తయారు చేసిన కారు ఎలా ఉందో చూడాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.