ETV Bharat / bharat

కాల్పుల విరమణతో ఉగ్రవాదానికి 'సంకెళ్లు'! - కశ్మీర్​ ఉగ్రవాదులు

భారత్​-పాకిస్థాన్​ మధ్య ఈ ఏడాది ఫిబ్రవరిలో కుదురిన కాల్పుల విరమణ ఒప్పందంతో కశ్మీర్​లో ఉగ్రవాదం తగ్గుముఖం పట్టినట్టు కనపడుతోంది. గతేడాది జులైతో పోల్చుకుంటే ఈ ఏడాది అదే కాలానికి ఉగ్రవాదుల మరణాలు 48శాతం తగ్గాయి. ఉగ్రవాద సంబంధిత ఘటనలు కూడా 16శాతం తగ్గాయి.

Kashmir militancy
కశ్మీర్​ ఉగ్రవాదం
author img

By

Published : Jul 10, 2021, 10:46 AM IST

Updated : Jul 10, 2021, 1:59 PM IST

జమ్ముకశ్మీర్​లో 'ఉగ్రవాదం' తగ్గుముఖం పట్టినట్టు కనపడుతోంది. భద్రతా దళాల సమాచారం ప్రకారం.. ఈ ఏడాదిలో జులై 7 వరకు జవాన్లు 66మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. గతేడాది ఇదే సమయంతో పోల్చితే అది 48శాతం తక్కువ. 2020లో మొత్తం మీద 215మంది ముష్కరులు మరణించారు. ఐదేళ్లల్లో ఆ సంఖ్య 937గా ఉంది. 2016-19 మధ్య కాలంలో వరుసగా 141, 213, 215, 153మంది.. భద్రతా దళాల చేతిలో హతమయ్యారు.

ఆ ఒప్పందంతోనే!

1989లో కశ్మీర్​లో ఉగ్రవాదం విజృంభించినప్పటి నుంచి 25,315కిపైగా మంది ముష్కరులు చనిపోయారు. ఈ ఏడాది ఉగ్రవాదుల మరణాల సంఖ్య పడిపోవడానికి.. ఫిబ్రవరి 24న భారత్​-పాకిస్థాన్​లు కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందం ఓ కారణం. దీనిబట్టి భారత్​పై దాడులు చేసేందుకు ఉగ్రవాదులను పాక్​ సైన్యం ఉసిగొల్పిందని స్పష్టమవుతోంది. సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడి, ఉగ్రవాదులను దొంగచాటున భారత్​లోకి పంపించడం పాక్​ నైజం.

తాజా ఒప్పందంతో సరిహద్దులో కాల్పుల మోత తగ్గింది. పౌరుల రక్షణ కోసం ఇరు దేశాలు ఈ ఒప్పందంపై సంతకం చేశాయి. ఫిబ్రవరి 24 తర్వాత నియంత్రణ రేఖ వెంబడి ఒక్క కాల్పుల ఘటన కూడా జరగకపోవడం గమనార్హం. 2021లో అప్పటివరకు 592సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లుపడ్డాయి. 2017లో 971, 2018లో 1,629, 2019లో 3,168, 2020లో 5,133సార్లు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన జరిగింది.

Kashmir militancy
ఎన్​కౌంటర్​ వేళ భద్రతాదళాలు

ఉగ్రవాద నియామకాల్లోనూ భారీ మార్పులు కనపడుతున్నాయి. ఈ ఏడాది జూన్​ 1 వరకు 58మంది యువత వివిధ ఉగ్రవాద సంస్థల్లో చేరారు. గతేడాది ఇదే కాలానికి పోల్చుకుంటే ఇది 28శాతం(81) తక్కువ. 2016-20 కాలంలో వరుసగా 88, 128, 191, 119, 166మంది ఆయుధాలు పట్టుకుని ఉగ్రవాదులుగా మారారు. అయితే కశ్మీర్​లో గల్లంతైన యువత సంఖ్యను ఈ అధికారిక లెక్కల్లో చేర్చలేదు. వారు కూడా ఉగ్రవాదంవైపు అడుగువేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

అటు ఉగ్రవాద ఘటనలు కూడా తగ్గాయి. 2020 జులై 1తో పోల్చుకుంటే(68).. 2021 జులై 1 నాటికి అది 19శాతం పడిపోయింది(16).

-- సంజీవ్​ కే బారువా, సీనియర్​ పాత్రికేయులు.

ఇదీ చూడండి:- ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలకు భారత్​ హెచ్చరిక

Last Updated : Jul 10, 2021, 1:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.