ETV Bharat / bharat

ప్రేమికుల రోజున భార్యకు కిడ్నీ గిఫ్ట్ - భార్యకు కిడ్నీ గిఫ్ట్

ప్రేమికుల రోజున తన భార్యకు అత్యంత విలువైన బహుమతి ఇచ్చాడు గుజరాత్​కు చెందిన ఓ వ్యక్తి. అది ఖరీదైన వజ్రమో, బంగ్లానో కాదు. జీవితంలో సగభాగంగా పరిగణించే భార్యకు తన శరీరంలోని ఓ అవయవాన్నే ఇచ్చేశాడు. వాలెంటైన్స్ డే రోజున ప్రేమకు సిసలైన అర్థం చెప్పాడు.

kidney-transplantation-gujarat husband saves wife
ప్రేమికుల రోజున భార్యకు కిడ్నీ గిఫ్ట్
author img

By

Published : Feb 14, 2021, 7:58 PM IST

ప్రేమికులకు మరపురాని రోజు ఉందంటే అది వాలెంటైన్స్ డే. తమ భాగస్వామిపై ఉన్న ప్రేమను తెలియజేసేందుకు అందమైన పూలు, మధురమైన చాక్లెట్లు, ముద్దుగా ఉండే టెడ్డీ బేర్లు వాలెంటైన్స్ డే రోజున కానుకగా ఇస్తుంటారు. కానీ, ప్రేమంటే ఇంతేనా? ఈ వాలెంటైన్స్ డేకు ఉన్న ప్రత్యేకత.. చాక్లెట్లు ఇచ్చిపుచ్చుకోవడంతోనే సరిపోతుందా? కానే కాదు! ప్రేమంటే అంతకుమించి. ప్రియమైనవారిపై ఉన్న ఆప్యాయతను తెలియజేసేందుకు ఒక్కోసారి ఇవేవీ సరిపోవు. తమ జీవితంలో భాగమైనవారికి ఏది చేసినా తక్కువే అవుతుంది. గుజరాత్​కు చెందిన ఈ జంట కూడా ఆ కోవకే చెందుతారు. ప్రేమంటే ఎంత గొప్పదో ప్రేమికుల రోజునే నిరూపించారు.

kidney-transplantation-gujarat husband saves wife
వినోద్-రీటా

అది 2017 సంవత్సరం. కిడ్నీ ఫెయిల్యూర్ అయిన విషయం 43 ఏళ్ల రీటా పటేల్​కు అప్పుడే తెలిసింది. అప్పటి నుంచి కాళ్లు వాచిపోవడం, ఊపిరాడకపోవడం ఆవిడకు రోజువారి సమస్యలుగా మారిపోయాయి. కిడ్నీని మార్చడమే సమస్యకు పరిష్కారమని డాక్టర్లు సూచించారు. కానీ అలా చెప్పగానే ఇలా ఆపరేషన్ చేసేయడానికి కిడ్నీ అంగట్లో సరకేం కాదు కదా. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఏటా 1.8 లక్షల మంది కిడ్నీ వైఫల్యాలతో బాధపడుతున్నారు. కానీ, కిడ్నీ దాతలు మాత్రం 6 వేలకు అటు ఇటుగా ఉంటున్నారు. బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్ దొరకాలన్నా కష్టమే. ఇలాంటి కేసులు ఎప్పటికోగానీ రావు. ఒకవేళ వచ్చినా.. వాళ్ల కిడ్నీ సరిపోతుందో లేదో అన్న అనుమానాలు ఉంటాయి.

వైద్య బృందంతో దంపతులు

ఇన్ని అనుమానాల మధ్య తన భార్యను ఈ సమస్య నుంచి బయటపడేసేందుకు రీటా పటేల్ భర్త వినోద్ ముందుకొచ్చాడు. కష్టసుఖాల్లో తన వెన్నంటే ఉండే భార్యను దూరం చేసుకోకూడదని నిశ్చయించుకున్నాడు. రీటాకు కావాల్సిన కిడ్నీని ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. '23 ఏళ్లు కలిసి జీవించిన తాము.. ఇకపైనా కలిసి జీవించాలనుకుంటున్నాం' అని ఈటీవీ భారత్​తో చెప్పాడు. తన భార్యను వ్యాధి నుంచి బయటపడేసేందుకు ఏం చేసేందుకైనా సిద్ధమేనని చెబుతున్నాడు.

ఈటీవీ భారత్​తో మాట్లాడిన రీటా-వినోద్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.