ETV Bharat / bharat

అడవిలో బంధించి.. మూడు నెలలుగా సామూహిక అత్యాచారం! - మూడు నెలలు అత్యాచారం

మహిళను అడవిలో బంధించి మూడు నెలల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు కిరాతకులు. బాధితురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

kidnapped from the village
మూడు నెలలుగా గ్యాంగ్​రేప్
author img

By

Published : Jun 28, 2021, 12:15 PM IST

ఓ మహిళను అడవిలో బంధించి మూడు నెలల పాటు సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని మీర్జాపుర్​లో జరిగింది.

ఏం జరిగిందంటే..?

మీర్జాపుర్​లోని పతేహరా గ్రామానికి చెంది ఓ మహిళను అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు బలవంతంగా కారులో అడవిలోకి తీసుకెళ్లాడు. అడవిలో మూడు నెలలు బంధించి మరో ముగ్గురు యువకులు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత మహిళను చిత్రహింసలు పెట్టి, వేధించారు. మరణించిందని భావించి అక్కడినుంచి వెళ్లిపోయారు. జూన్​ 7న కొందరు పశువుల కాపరులు.. మహిళ అపస్మారకస్థితిలో ఉండటాన్ని గమనించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మహిళను సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు.

ఆ తర్వాత స్పృహలోకి వచ్చిన యువతి.. జరిగిన విషయం పోలీసులకు వివరించింది. తన భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ అజయ్ కుమార్ సింగ్ తెలిపారు.

ఇదీ చదవండి : ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.