తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సినీనటి ఖుష్బూ.. తన వద్ద 8.5 కిలోల బంగారం, 78 కిలోల వెండి ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. రూ.6.39 కోట్ల చరాస్తులు, రూ.34.56 కోట్ల స్థిరాస్తులు సహా మొత్తం రూ.40.96 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలిపారు.
భర్త సుందర్ సి వద్ద 495 గ్రాముల బంగారం, 9 కిలోల వెండి ఉన్నట్లు వెల్లడించారు. ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నట్లు పేర్కొన్నారు. వార్షిక ఆదాయం రూ.1.50 కోట్లుగా తెలిపారు.
ఇదీ చదవండి : 'అభిమానులు ఓటు బ్యాంకు కాదు'