సాగు చట్టాలు, పెట్రోల్-డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ పాల ధరను పెంచుతున్నట్లు హరియణా హిసార్‌లోని ఖాప్ పంచాయత్ పేర్కొంది. లీటరు పాల ధర రూ.100కు పెంచాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ప్రభుత్వ సహకార సంఘాల వారికి ఈ ధరకు పాలు అమ్మాలని డైరీ వ్యాపారులను కోరినట్లు స్పష్టం చేసింది.
"మార్చి 1 నుంచి పాల ధరలను పెంచాలని హిసార్ డైరీ వ్యాపారులను కోరాం. సామాన్యులకు మాత్రం రూ.55-60కే పాలు విక్రయించమని స్పష్టం చేశాం. ప్రభుత్వాన్ని నిద్రలేపేందుకు ఈ చర్య చేపడుతున్నాం. సాగు చట్టాలను రద్దు చేయాల్సింది, ఇంధన ధరలు తగ్గించాల్సింది ప్రభుత్వమే."
-ఫూల్ కుమార్ పెట్వార్, ఖాప్ పంచాయత్ నాయకుడు.
ఇంధన ధరలు పెరగడం వల్ల రైతులకు కూడా భారీ నష్టం కలుగుతుందని ఖాప్ పంచాయత్ నాయకుడు వ్యాఖ్యానించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడాన్ని నిరసిస్తూ చాలా మంది ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
ఇదీ చదవండి:న్యాయం కోసం గుండు గీయించుకొని తల్లి నిరసన