ETV Bharat / bharat

60 చదరపు అడుగుల దుకాణం ఖరీదు రూ.1.72కోట్లు.. అంత ధర ఎందుకంటే.. - దేశంలో అత్యంత ఖరీదైన ప్రసాదం దుకాణం

వినాయక చవితి సందర్భంగా వేలంపాటలో రూ.లక్షలు పెట్టి లడ్డూలను దక్కించుకుంటారు భక్తులు. కొందరు పరువుప్రతిష్ఠల కోసం ఆ పని చేస్తే.. మరికొందరు ఆ ప్రసాదం వల్ల మంచి జరుగుతుందని నమ్ముతారు. అలాగే మధ్యప్రదేశ్​కు చెందిన ఓ వ్యాపారి ఏకంగా గణేశ్ దేవాలయంలోని ఓ దుకాణాన్ని రూ. కోటి 72 లక్షలకు కొనుగోలు చేశారు. అంత ధర పెట్టి ఆ దేవాలయంలోని దుకాణాన్ని ఎందుకు కొనుగోలు చేశారో తెలుసా?

india most expensive prasad shop in indore
గణేశ్ టెంపుల్​లోని ప్రసాదం దుకాణం
author img

By

Published : Feb 6, 2023, 5:09 PM IST

దేవుడిపై భక్తితో వేలంపాటలో లక్షలు ఖర్చు చేసి లడ్డూను దక్కించుకోవడం చూస్తుంటాం. అలాగే దేవుడిపై విశ్వాసం, భక్తి ఉన్నవారు ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడరు. అచ్చం అలాంటి ఘటనే మధ్యప్రదేశ్​లోని ఇందోర్​లో జరిగింది.
ఇందోర్​లోని ఖజరానా గణేశ్ దేవాలయం ఉంది. ఈ దేవాలయానికి రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా భక్తులు వస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ ఆలయంలో ఓ ప్రసాదాల దుకాణం గురించి చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇదే భారత్​లో అత్యంత ఖరీదైన ప్రసాదాల దుకాణం. కేవలం 60 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ దుకాణాన్ని రూ.కోటి 72 లక్షలకు కొనుగోలు చేశారు దేవేంద్ర ఠాకూర్​ అనే వ్యక్తి. అంటే ఒక చదరపు అడుగు అక్షరాలా రూ.2.47 లక్షలు అన్నమాట.

india most expensive prasad shop in indore
భారీ ధర పలికిన ప్రసాదం దుకాణం

దేవేంద్ర.. గణేశ్ ఆలయ ప్రాంగణంలో లడ్డు ప్రసాదాన్ని విక్రయించేవారు. అయితే ఆలయాన్ని పునరుద్ధరించిన తర్వాత ఆలయ పాలకవర్గం కొత్త దుకాణాలను నిర్మించింది. వేలానికి ఆహ్వానించగా.. 6 టెండర్లు వచ్చాయి. భారీ మొత్తం వెచ్చించి దేవేంద్ర ఆలయ ప్రాంగణంలోని ప్రసాదం దుకాణాన్ని దక్కించుకున్నాడు దేవేంద్ర. ఈ దుకాణానికి 'శ్రీ అష్టవినాయక' అని పేరు పెట్టారు దేవేంద్ర. అలాగే ఈ ప్రసాద విక్రయశాలను గణేశ్​కు అంకితమిస్తున్నట్లు తెలిపారు.

"చాలా ఏళ్లుగా గణేశ్ దేవాలయ ప్రాంగణంలో లడ్డూ ప్రసాదం విక్రయిస్తున్నాను. ఖజరానా గణేశుడిపై నాకు అపారమైన విశ్వాసం ఉంది. అందుకే అందులోని దుకాణాన్ని భారీ ధరకు కొనుగోలు చేశా. భగవంతుని దయతో ఇదంతా జరిగిందని భావిస్తున్నా."

--దేవేంద్ర ఠాకూర్​, దుకాణం యజమాని

ఇందోర్​లోని ఖజరానా గణేశ్ టెంపుల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.