ETV Bharat / bharat

'బ్లాక్​ ఫంగస్​ అంటే భయం వద్దు కానీ..'

బ్లాక్​ ఫంగస్​ కేసులు నమోదవుతున్న తరుణంలో దిల్లీలోని మేదాంతా ఆస్పత్రి ఛైర్​పర్సన్​​ డాక్టర్​ నరేశ్​ త్రెహన్, ఎయిమ్స్​ డైరెక్టర్ డాక్టర్​ గులేరియా కీలక సూచనలు చేశారు. డయాబెటిస్​ (మధుమేహం) రోగులకు ఈ వ్యాధి ఎక్కువగా సోకే అవకాశం ఉందని అన్నారు. అంతేకాకుండా స్టెరాయిడ్స్​ ఎక్కువ వాడడం వల్ల ఈ వ్యాధి సోకే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అందువల్ల చక్కెర​ స్థాయుల్ని అదుపులో ఉంచుకోవాలన్నారు. స్టైరాయిడ్స్​ను వైద్యుల సూచన మేరకే వాడాలన్నారు.

black fungus
బ్లాక్​ ఫంగస్
author img

By

Published : May 21, 2021, 10:18 PM IST

కరోనా నుంచి కోలుకున్న కొందరు బ్లాక్​ ఫంగస్​(మ్యూకర్​మైకోసిస్) బారిన పడుతున్నారు. ఈ సమయంలో దిల్లీలోని మేదాంతా ఆస్పత్రి ఛైర్​పర్సన్​ డాక్టర్​ నరేశ్​ త్రెహన్​​, ఎయిమ్స్​ డైరక్టర్ డాక్టర్​ గులేరియా కీలక సూచనలు చేశారు.

సూచనలు చేస్తున్న మేదాంతా ఆసుపత్రి ఛైర్మన్​ డాక్టర్​ నరేశ్​ త్రెహన్, ఎయిమ్స్​ డైరెక్టర్ డాక్టర్​ గులేరియా
  • డయాబెటిస్​ను నియంత్రణలో ఉంచుకోవాలి.
  • మితంగా స్టెరాయిడ్స్​ను వాడాలి.
  • ఎక్కువ రోజులున్న పాడైపోయిన ఆహారపదార్థాలలో, మట్టిలో ఈ శిలీంధ్రం పెరుగుతుంది.
  • ఈ వ్యాధి మెదడు, కాలేయం, ముక్కుపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది.
  • షుగర్​, కేన్సర్​​, హెచ్​ఐవీ/ ఎయిడ్స్​ రోగులకు ఈ వ్యాధి ప్రాణాంతకం.
  • బ్లాక్​ ఫంగస్​కు మందు ఉంది. అందువల్ల భయపడాల్సిన పనిలేదు.
  • సరైన సమయంలో వ్యాధిని గుర్తిస్తే నయం చేయవచ్చు.
  • 2002లో సార్స్​ వ్యాధి ప్రబలినప్పుడు కూడా బ్లాక్​ ఫంగస్​ వ్యాపించింది.
  • కరోనా రెండో దశలో స్టెరాయిడ్​ వాడకం పెరిగింది. స్టెరాయిడ్స్​ను డాక్టర్ల సూచన మేరకే వాడాలి.
  • ఇష్టం వచ్చినట్లు స్టెరాయిడ్​ తీసుకోవడం వల్ల చక్కెర​ స్థాయులు పెరుగుతాయి. తద్వారా బ్లాక్​ ఫంగస్​ సోకుతుంది.
  • పచ్చి ఆహారం, కూరగాయలు తింటే వస్తుందనడానికి ఆధారాలు లేవు.
  • హోం ఐసోలేషన్​లో ఉన్నవారికి కూడా వస్తుంది.

బ్లాక్​ ఫంగస్ కేసులు దేశంలో పెరిగిపోతున్నాయి. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హరియాణా, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాలు దీనిని 'అంటువ్యాధుల చట్టం ప్రకారం' 'గుర్తించదగిన వ్యాధిగా' ఇప్పటికే ప్రకటించాయి. తద్వారా ప్రతి బ్లాక్​ ఫంగస్​ కేసును రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడం తప్పనిసరి.

ఇప్పటివరకు దిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 197 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ శుక్రవారం తెలిపారు.

ఇదీ చదవండి: బ్లాక్​ ఫంగస్ ఔషధ ఉత్పత్తికి కేంద్రం చర్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.