ఈ నెల 19 నుంచి జరగనున్న పార్లమెంటు వర్షకాల సమావేశాల్లో మొత్తం 23 బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం వెల్లడించింది. సభలో ప్రవేశపెట్టే బిల్లుల వివరాలు లోకసభ సచివాలయం మంగళవారం వెల్లడించింది. ఇందులో 17 కొత్త బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఉన్న 3 ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులు తెస్తున్నామని కేంద్రం తెలిపింది.
ప్రవేశపెట్టనున్న బిల్లులు..
- ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ బిల్లు
- స్పెషల్ డిఫెన్స్ సర్వీసెస్ బిల్లు
- జాతీయ ఆహార టెక్నాలజీ సంస్థ బిల్లు
- దేశ రాజధాని ప్రాంత గాలి నాణ్యత యాజమాన్యంపై ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు
- విద్యుత్ చట్ట సవరణ బిల్లు సహా గిరిజన సంస్కరణలు, డీఎన్‌ఏ టెక్నాలజీ బిల్లులను ప్రవేశపెట్టనుంది. గిరిజన సంస్కరణల బిల్లును స్థాయీల సంఘానికి పంపే అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది.
వీటితో పాటు ఫ్యాక్టరింగ్ రెగ్యులేషన్ బిల్లు, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్లు, తల్లిదండ్రులు-వృద్ధుల సంక్షేమం బిల్లును ప్రవేశపెట్టనుంది.
ఇదీ చదవండి : కేబినెట్ కమిటీలలో కొత్త మంత్రులకు అవకాశం