ETV Bharat / bharat

కరోనాను దరిచేరనీయని ఆదర్శ గ్రామం - ఇడుక్కుడిలో వైరస్ వ్యాప్తి

కొవిడ్ రెండో దశ వ్యాప్తి భారత్​ను అతలాకుతలం చేస్తోంది. కానీ.. కేరళలోని ఓ గ్రామంలో ఒక్కరూ వైరస్ బారిన పడలేదు. నిబంధనలకు కట్టుబడి ఉండటం వల్లే ఇది సాధ్యమైందని గ్రామస్థులు చెబుతున్నారు.

Idamalakkudi
కేరళ, ఇడమలక్కుడి
author img

By

Published : May 12, 2021, 7:53 AM IST

దేశంలో కొవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పటికీ కేరళ ఇడుక్కి జిల్లాలోని ఇడమలక్కుడి పంచాయతీ పరిధిలో ఒక్కరూ వైరస్​ బారిన పడలేదు. మొదటి నుంచి కొవిడ్​ను పూర్తి స్థాయిలో కట్టడి చేసి సఫలీకృతమయ్యారు అక్కడి ప్రజలు.

Idamalakkudi
ఈ ప్రాంతంలో ఒక్కరికీ వైరస్ సోకలేదు

ఈ గ్రామంలో దాదాపు 2,000 మంది నివసిస్తున్నారు. ఇది రాష్ట్రంలోనే ఏకైక గిరిజన గ్రామ పంచాయతీ.

అనుమతి తప్పనిసరి..

కొవిడ్​ నిబంధనలు సరిగ్గా అమలు చేయడం వల్లే తాము వైరస్​ బారిన పడలేదని గ్రామస్థులు చెబుతున్నారు. తమ ప్రాంతానికి ఎవరు రావాలన్నా రాష్ట్ర అటవీ శాఖ నుంచి అనుమతి పొందాల్సిందే అని తెలిపారు.

Idamalakkudi
వైరస్​ కట్టిడిలో సఫలమైన గ్రామం

నిత్యావసరాలు ఎలా?

రేషన్​ సరకులు మినహా మిగిలిన అన్ని వస్తువులు వారంలో ఒకసారి తెచ్చుకుంటారు ఈ గ్రామస్థులు. అందరి తరఫున ఒకరే వెళ్లి ఈ వస్తువులు తీసుకొస్తారు. బయటకు ఎవరు వెళ్లినా రెండు వారాల పాటు క్వారంటైన్​లో ఉంటారు. ఈ విధమైన కఠిన నిబంధనలు పాటించడం వల్లే ఈ గిరిజనులు వైరస్​ బారిన పడకుండా సురక్షితంగా ఉన్నారని సబ్ కలెక్టర్ ప్రేమ్ క్రిష్ణణ్ తెలిపారు.

ఇదీ చదవండి:కరోనాపై పోరులో వీరు అ'సామాన్యులు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.