కేరళలో నాటు బాంబు పేలి ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. కన్నూర్ జిల్లా ఇర్రిట్టి పడికచల్లో జరిగిందీ ఘటన.
ఎలా జరిగింది?
మహ్మద్ అమిన్(5), మహ్మద్ రదేహ్(ఏడాదిన్నర) సోదరులు తమ ఇంటి ముందు కనిపించిన బాలు ఆకారంలో ఉన్న ఐస్క్రీమ్ కప్పును ఇంట్లోకి తీసుకెళ్లారు. అందులో బాంబు ఉందని తెలియక.. దాంతో ఆడుకుంటూ తెరవబోయారు. ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి కిటికి అద్దాలు పగిలిపోయాయి.
![crude bomb explodes in Kannur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04:30:07:1620126007_img-20210504-wa0007_0405newsroom_1620125915_434.jpg)
![crude bomb explodes in Kannur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04:30:08:1620126008_img-20210504-wa0005_0405newsroom_1620125915_803.jpg)
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను పరియరామ్ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మూడు రోజుల్లోనే ఈ ఘటన జరగడం చర్చనీయాంశమైంది.
ఇదీ చూడండి: కశ్మీర్లో ఎన్కౌంటర్- పట్టుబడిన విదేశీ ఉగ్రవాది