ETV Bharat / bharat

భారత తొలి అంతరిక్ష యాత్రికుడిగా రికార్డ్!​ - రిచర్డ్ బ్రాన్సన్

కేరళకు చెందిన ప్రసిద్ధ పర్యటకుడు సంతోశ్​ జార్జ్​ కులంగర అంతరిక్ష యాత్రకు(Space tourism) వెళ్లనున్నారు. ఇందుకు రిచర్డ్ బ్రాన్సన్​కి చెందిన వర్జిన్​ గెలాక్టిక్(virgin galactic) నౌకలో రోదసిలో పర్యటించడానికి టికెట్ బుక్ చేసుకున్నారు.

India's first space tourist
భారతీయ తొలి అంతరిక్ష యాత్రికుడు
author img

By

Published : Jul 18, 2021, 5:05 PM IST

బ్రిటన్​ కుబేరుడు రిచర్డ్ బ్రాన్సన్ సహా పలువురు దిగ్విజయంగా అంతరిక్షయాత్ర చేసి.. తిరిగి భూమికి చేరుకున్నారు. దీంతో రోదసియాత్రపై(Space tourism) ప్రజల్లో ఆసక్తి పెరిగినట్లు తెలుస్తోంది. తాజాగా వర్జిన్​ గెలాక్టిక్(virgin galactic) నౌకలో అంతరిక్షయాత్ర చేయడానికి ఓ భారతీయుడు కూడా టికెట్​ బుక్​ చేసుకున్నారు. దీంతో ఆకాశవీధుల్లో విహరించే తొలి వ్యక్తి కానున్నారు కేరళకు చెందిన సంతోశ్​ జార్జ్​ కులంగర. 2.5 లక్షల డాలర్లు (రూ.1.8 కోట్లు) వ్యయంతో ఈ అంతరిక్ష పర్యటనకు వెళ్లనున్నారు. ఆయనతో పాటు ఓ కెమెరా కూడా తీసుకెళ్లనున్నట్లు సంతోశ్​ తెలిపారు. అలాగే ఈ పర్యటన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మళయాలీల తరఫున చేపడుతున్నానని పేర్కొన్నారు.

India's first space tourist
సంతోశ్​ జార్జ్​ కులంగర
India's first space tourist
రిచర్డ్ బ్రాన్సన్​తో సంతోశ్​ జార్జ్​ కులంగర
India's first space tourist
వర్జిన్​ గెలాక్టిక్ నౌకలో సంతోశ్

సంచారం అనే పేరుతో వన్ మ్యాన్ ఆర్మీ ట్రావెల్లాగ్ కార్యక్రమం ద్వారా యాత్రలు చేసి.. ప్రసిద్ధి చెందారు సంతోష్​. ఆయన ఇప్పటివరకు 24 ఏళ్ల వ్యవధిలో 130కి పైగా దేశాలను చుట్టి వచ్చారు. సంచారం ద్వారా ఇప్పటివరకు 1800 ఎపిసోడ్లను ప్రసారం చేశారు. సంతోశ్​.. 2007 నుంచి అంతరిక్ష యాత్ర చేయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే అవకాశం ఇప్పుడు లభించింది. దీంతో భారత్​ నుంచి అంతరిక్ష పర్యటనకు వెళ్లనున్న తొలి భారతీయుడు కానున్నారు.

ఇదీ చూడండి: రోదసిలో కొత్త చరిత్ర- రిచర్డ్ అంతరిక్ష యాత్ర సక్సెస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.