ETV Bharat / bharat

బులెట్​ బైక్​ల రిపేరింగ్​లో దిట్ట ఈ 'దియా' - కేరళ న్యూస్​

బులెట్​ బండిపై యువతకు క్రేజ్​ ఎక్కువ. అయితే.. మహిళలు వాటిని నడపటం చాలా అరుదుగా కనిపిస్తుంది. అలాంటి ఓ యువతి బులెట్​ నడపటమే కాదు.. దానిని రిపేర్​ చేయటంలోనూ నేర్పరి. ఓవైపు తన చదువు కొనసాగిస్తూనే బులెట్​ మెకానిక్​గా అందరి మన్ననలు పొందుతోంది.

Girl Repairs Bullet Bikes
బులెట్​ బైక్​ల రిపేరింగ్​లో దిట్ట ఈ 'లేడీ మోకానిక్​​'
author img

By

Published : Sep 12, 2021, 5:32 PM IST

బులెట్​ బైక్​లు రిపేర్​ చేస్తున్న 18 ఏళ్ల యువతి

ప్రస్తుతం ప్రపంచం వేగంగా మారిపోతోంది. మహిళలు తమకు ఉన్న హద్దులు చెరిపేస్తూ ఏ పనినైనా తాము చేయగలమని నిరూపిస్తూ ఔరా అనిపిస్తున్నారు. అలాంటి కోవకే చెందుతుంది కేరళ కొట్టాయం​కు చెందిన 18 ఏళ్ల యువతి. బులెట్​ బైక్​లను ప్రొఫెషనల్​ మెకానిక్​లా రిపేర్​ చేస్తూ.. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆమెనే దియా జోసెఫ్​.

కొట్టాయం​కు చెందిన జోసెఫ్​ కూతురే దియా. జోసెఫ్​ నగరంలోని రైల్వే స్టేషన్​కు సమీపంలో ద్విచక్రవాహన మెకానిక్​ వర్క్​ షాప్​ నడిపిస్తున్నారు. తండ్రి చేసే పనిని రోజూ గమనిస్తూ.. బులెట్​ బైక్​లను ఎలా బాగు చేయాలో తెలుసుకుంది. 10వ తరగతిలో ఉన్నప్పుడు వేసవి సెలవుల్లో తండ్రికి సాయం చేస్తూ.. రిపేరింగ్​లో పూర్తి పట్టు సాధించింది. ప్రస్తుతం.. బైకులకు ఆయిల్​ మార్చటం, ఇతర సాధారణ రిపేర్లు వంటివి చేస్తోంది. ఈ క్రమంలోనే బులెట్​ నడపటమూ నేర్చేసుకుంది దియా.

మెకానిక్​ వర్క్​షాప్​కు వచ్చే వినియోగదారులు దియా పనిని చూసి మెచ్చుకుంటున్నారు. మెకానిక్​గానే కాకుండా చదువులోనూ రాణిస్తోంది. ఇంటర్​లో 98 శాతం మార్కులతో ఔరా అనిపించింది. ప్రస్తుతం దియా.. ఇంజినీరింగ్​ ప్రవేశ పరీక్షకు సన్నద్ధమవుతోంది. అయినప్పటికీ.. తనకు సమయం దొరికినప్పుడల్లా బులెట్​ బైక్​లు రిపేర్​ చేస్తూ.. రోజుకు రూ.2000 వరకు సంపాదిస్తోంది.

తాను ఆటోమొబైల్​ ఇంజినీరింగ్​ చేయాలనుకుంటున్నట్లు తెలిపింది దియా. అయితే.. బులెట్​ మెకానిక్​ పనిని కొనసాగిస్తానని చెబుతోంది. మరోవైపు.. తనకు డ్రైవింగ్​ లైసెన్స్​ రాగానే తండర్​బోల్ట్​ బులెట్​ బైక్​పై లాంగ్​ డ్రైవ్​కు వెళ్లాలనుకుంటున్నాని తెలిపింది దియా. ఆ బైక్​ను తన తండ్రి కానుకగా ఇచ్చినట్లు చెప్పింది.

ఇదీ చూడండి: సొంతిల్లు, సొంత వాహనం లేని ముఖ్యమంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.