Kerala Sex Racket: లైంగిక వాంఛ తీర్చుకోవడానికి భాగస్వాములను మార్చుకుంటున్న వ్యవహారం కేరళలో కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. కొట్టాయం జిల్లాలోని కరుకాచల్ పోలీస్ స్టేషన్లో ఓ మహిళ చేసిన ఫిర్యాదుతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఈ కేసుకు సంబంధించి మరో 25 మంది పరిశీలనలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన గ్రూపులో 1,000కి పైగా జంటలు ఉన్నాయని.. వారు తమ భాగస్వాములను మార్పిడి చేసుకుంటున్నారని పోలీసులు చెప్పారు. నిందితులు.. కేరళలోని మూడు జిల్లాలకు చెందినవారని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలువురు వ్యక్తులకు ఈ సెక్స్ రాకెట్‌తో సంబంధాలున్నట్లు తెలిపారు. సమాజంలో ఉన్నతస్థాయి వ్యక్తులూ ఈ వ్యవహారంలో భాగమైనట్లు చెప్పారు.
"వీరంతా తొలుత టెలిగ్రామ్, మెసెంజర్ గ్రూపుల్లో చేరుతారు. తర్వాత రెండు లేదా మూడు జంటలు ఎప్పటికప్పుడు కలుసుకుంటాయి. ఆ తర్వాత మహిళలను మార్చుకుంటారు. ఏక కాలం ఒకే మహిళతో ముగ్గురు పురుషులు శృంగారంలో పాల్గొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ వ్యవహారంలో డబ్బులు కూడా చేతులు మారుతున్నాయి. డబ్బులు ఇస్తే పెళ్లి కాని వ్యక్తులకు సైతం మహిళలను సరఫరా చేస్తున్నారు."
-కొట్టాయం సీనియర్ పోలీసు అధికారి
ఈ గ్రూపుతో సంబంధమున్న వారి వివరాలను రాబట్టేందుకు పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతోందని అధికారులు వెల్లడించారు. వారికి ఇతర గ్రూపులతో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో సమగ్ర విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: ముగ్గురు బాలికలపై రేప్.. తెలిసినవారేనని నమ్మి వెళ్తే...