ETV Bharat / bharat

పసిప్రాయంలోనే జీవన పోరాటం- సైకిలెక్కి చేపల విక్రయం - child worker

అడిపాడాల్సిన వయసులోనే జీవన పోరాటం చేస్తున్నారు ఈ చిన్నారులు. తల్లితండ్రులు వదిలేసినా.. నిరాశ, నిస్పృహలకు లోనుకాకుండా ముందుకు సాగుతున్నారు. లాక్​డౌన్ కారణంగా ఆర్థిక కష్టాలు రావడం వల్ల నానమ్మతో కలిసి చేపలు విక్రయిస్తున్నారు. కేరళకు చెందిన అభిజిత్​(11), అమృత(12)ల కథేంటో తెలుసుకోండి.

boy suvive family
చేపలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్న బాలుడు
author img

By

Published : Jul 6, 2021, 3:17 PM IST

చేపలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్న బాలుడు

పనిచేస్తేగాని ఇళ్లు గడవదు ఆ చిన్నారులకు. అయినా.. నిరాశ, నిస్పృహలకు లోనుకాకుండా జీవనపోరాటాన్ని సాగిస్తున్నారు. వారి నానమ్మతో కలిసి చేపల అమ్మకం చేపడుతున్నారు.

చేపల అమ్మకం..

కేరళలోని తిరువనంతపురానికి చెందినవారు అభిజిత్​(11), అమృత(12). వారి నానమ్మ సుధ దగ్గరే ఉంటారు. చిన్న టీ స్టాల్​ నడుపుతూ వారి బాధ్యతను చూసుకునేది సుధ. కరోనా కారణంగా టీ స్టాల్​ మూతపడింది. దీంతో వారు చేపల విక్రయం చేస్తున్నారు. ఉదయాన్నే లేవగానే దగ్గరలోని విళింజమ్​ ప్రాంతం నుంచి చేపలు కొనుగోలు చేస్తారు. అనంతరం సైకిల్​పై చేపల పెట్టెను పెట్టుకుని పంచకరి జంక్షన్​ వద్దకు చేరుకుంటారు. అక్కడ సుధ చేపలను విక్రయిస్తుంది. ఆమెకు చేదోడువాదోడుగా ఉంటాడు అభిజిత్​. తానే స్వయంగా సైకిల్​పై చేపల పెట్టెను పెట్టుకుని వీధుల వెంట తిరుగుతూ అమ్ముతాడు. ఈ విధంగా వచ్చిన డబ్బుతో జీవనాన్ని సాగిస్తున్నారు.

తానే అమ్మానాన్నై..

అభిజిత్​, అమృత పసిపిల్లలుగా ఉన్నప్పుడే తల్లితండ్రులు వారిని ఓ అంగన్​వాడీ కేంద్రంలో వదిలివెళ్లారు. బంధువులెవరూ చేరదీయలేదు. విషయం తెలుసుకున్న నానమ్మ సుధ.. వారికి అన్నీ తానే అయి చేరదీసింది. తనే వారి బాగోగులు చూసుకుంటోంది. దిక్కుతోచని స్థితిలో పిల్లలకు అన్నం పెట్టడానికి ఒకానొక సందర్భంలో యాచకురాలిగానూ మారింది.

నగరంలోని పట్టోమ్​లో ఉన్న సెయింట్​ మేరీ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు అభిజిత్. పోలీస్ కావడం తన కల అంటున్నాడు. నానమ్మను గౌరవంగా చూసుకుంటానని చెబుతున్నాడు. సెయింట్​ ఫిలోమినాస్ కాన్వెంట్​లో ఎనిమిదవ తరగతి చదువుతోంది అమృత. కలెక్టర్ అవుతానని అంటోంది. తమ లాగే ఇబ్బందులు పడేవారికి సహాయం చేస్తానని చెబుతోంది. పిల్లలిద్దరితో కలిసి గత 15 ఏళ్లుగా అద్దె భవనంలో నివసిస్తోంది సుధ. క్యాన్సర్​తో బాధపడుతున్నా.. పిల్లల బాగుకోసం ఆరాటపడుతోంది. ఉండటానికి ఒక ఇళ్లు కట్టించి, పిల్లలకు ఉన్నత చదువులు అందించాలని కోరుకుంటోంది.

ఇవీ చదవండి:అక్షరాలు దిద్దించాల్సిన టీచర్..​ ఏం చేసిందంటే?

బంజరు భూమి కొని... అడవిని సృష్టించి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.