కేరళలో కరోనా (Corona cases) విజృంభణ తగ్గుముఖం పట్టింది. ఆ రాష్ట్రంలో కొత్తగా 10,402 కేసులు నమోదయ్యాయి. మరో 25,586 మంది కోలుకోగా.. మహమ్మారి ధాటికి 66 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 38.15 లక్షలకు చేరింది.
మహారాష్ట్రలో కొత్తగా 4,141 కరోనా కేసులు వెలుగు చూశాయి. మరో 145 మంది చనిపోగా.. కొత్తగా 4,780 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
దేశ రాజధాని దిల్లీలో.. 24 మందికి వైరస్ సోకింది. కరోనా కారణంగా ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు.
ఇతర రాష్ట్రాల్లో ఇలా..
తమిళనాడులో 1,630 మంది మహమ్మారి బారినపడ్డారు. 1,827 మంది వైరస్ నుంచి కోలుకోగా.. మరో 23మంది ప్రాణాలు కోల్పోయారు.
కర్ణాటకలో కొత్తగా 1,189 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,456 మంది కోలుకోగా.. 22 మంది మృతిచెందారు.
ఒడిశాలో కొత్తగా 853 మందికి కరోనా సోకగా.. 69 మంది ప్రాణాలు కోల్పోయారు.
సిక్కింలో 70, నాగాలాండ్‌లో 35, గుజరాత్లో 15, ఉత్తర్‌ప్రదేశ్‌లో 19, మధ్యప్రదేశ్‌లో 5 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి.
గోవాలో తాజాగా 76 కరోనా కేసులు వెలుగు చూశాయి. కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు కర్ఫ్యూని ఈ నెల 30 వరకు పొడిగించారు.
ఇదీ చూడండి: జుట్టు అలా ఉంటే కాలేజ్‌లోకి నో ఎంట్రీ!