కేరళలో కరోనా రోజువారీ కేసులు(Kerala Corona Cases) క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. ఆ రాష్ట్రంలో కొత్తగా 9,361 మంది.. వైరస్(Kerala Corona Cases) బారిన పడినట్లు తేలింది. వైరస్ ధాటికి(Kerala Covid Cases News) మరో 99 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా కేసులతో కలిపి, కేరళలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 48,88,678కి చేరింది. మరణాల సంఖ్య 27,765కు పెరిగింది. మరో 9,855 మంది కోలుకోగా యాక్టివ్ కేసుల సంఖ్య 80,892కు పడిపోయింది.
వివిధ రాష్ట్రాల్లో కొత్త కేసులు ఇలా..
- కర్ణాటకలో కొత్తగా 378 కరోనా కేసులు నమోదయ్యాయి. 464 మంది కోలుకోగా.. 11 మంది మృతి చెందారు.
- ఒడిశాలో కొత్తగా 467 మందికి కరోనా సోకగా.. మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
- బంగాల్లో 883 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి. 14 మంది మరణించారు.
ఇవీ చూడండి:
- త్రివర్ణ కాంతుల్లో మెరిసిన చారిత్రక కట్టడాలు
- India 100 crore vaccine: ఆ యువతి పాట విన్న ప్రధాని!
- చరిత్ర సృష్టించిన భారత్.. టీకా పంపిణీ@100కోట్లు
- వ్యాక్సినేషన్ @100 కోట్లు- ప్రత్యేక గీతం, ఏవీ విడుదల
- India 100 crore vaccine: భారత్కు డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలు!
- Vaccine Milestone: దేశంలో టీకా పంపిణీ సాగిందిలా..