ETV Bharat / bharat

కేరళలో తగ్గిన కొవిడ్ కేసులు.. కొత్తగా ఎన్నంటే? - maharashtra covid 19 cases

కేరళలో 7,555 కరోనా (Kerala Covid) కేసులు వెలుగులోకి వచ్చాయి. 24 గంటల వ్యవధిలో 74 మరణాలు సంభవించాయి. అటు, దిల్లీలో రోజువారీ కొవిడ్ మరణాలు సున్నాగా నమోదయ్యాయి. కొత్తగా 32 కేసులు (Delhi Covid cases) బయటపడ్డాయి.

KERALA COVID CASES
కేరళ కొవిడ్ కేసులు
author img

By

Published : Oct 17, 2021, 7:26 PM IST

కేరళలో కొత్తగా 7,555 కరోనా కేసులు (Kerala Covid 19 cases) నమోదయ్యాయి. క్రితం రోజు(7,995)తో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. 74 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కొవిడ్ కేసుల సంఖ్య 48,45,115కు పెరిగింది. మరణాల సంఖ్య 26,865కు పెరిగింది. (Kerala Covid cases news )

24 గంటల వ్యవధిలో 73,157 నమూనాలను పరీక్షించినట్లు కేరళ వైద్య శాఖ మంత్రి వీణా జార్జ్ (Kerala Health minister) తెలిపారు. త్రిస్సూర్​లో అత్యధికంగా 998 కేసులు, ఎర్నాకులంలో 975, తిరువనంతపురంలో 953 కేసులు వెలుగుచూసినట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 87,593 యాక్టివ్ కేసులు ఉన్నాయని వివరించారు.

కొత్తగా కరోనా బారిన పడ్డవారిలో 44 మంది రాష్ట్రం బయట నుంచి వచ్చారని తెలిపారు. 7,162 మందిని కాంటాక్ట్ ట్రేసింగ్ గుర్తించినట్లు చెప్పారు. సన్నిహితుల నుంచే వీరికి కొవిడ్ సోకిందని వివరించారు. మిగిలిన 278 మందికి ఎలా సోకిందనేది తెలియాల్సి ఉందన్నారు.

మహాలో

మహారాష్ట్రలో కొత్తగా 1,715 కొవిడ్ కేసులు (Maharashtra Covid Cases) వెలుగులోకి వచ్చాయి. 2,680 మంది కోలుకున్నారు. 29 మరణాలు సంభవించాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 28,631గా ఉంది.

తాజా కేసులతో (Maharashtra Covid 19 cases) రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 65,91,697కు చేరింది. మరణాల సంఖ్య 1,39,789కి పెరిగింది.

ఒడిశా..

ఒడిశాలో కొత్తగా 443 కేసులు వెలుగులోకి వచ్చాయి. కరోనా కారణంగా మూడు మరణాలు సంభవించాయి. కొత్త కేసుల్లో 18 ఏళ్ల లోపు వారు 75 మంది ఉన్నారని రాష్ట్ర వైద్య శాఖ తెలిపింది. చిన్నారుల్లో ఇన్ఫెక్షన్ రేటు 16.93 శాతంగా ఉందని పేర్కొంది.

రాజధానిలో..

దిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు 0.07 శాతంగా నమోదైంది. కొత్తగా 32 కేసులు (Delhi Covid cases) బయటపడ్డాయి. కరోనా కారణంగా 24 గంటల్లో ఎవరూ మరణించలేదు.

చిన్నారులకు టీకా..

మరోవైపు, కరోనా వ్యాప్తిలో చిన్నారుల పాత్ర కూడా ఉందని కొవిడ్ టాస్క్​ఫోర్స్ చీఫ్ వీకే పాల్ పేర్కొన్నారు. వారిలోనూ అధికంగా కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా చిన్నారులకు టీకాలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనే విషయంపై మాట్లాడారు. ఈ వివరాల కోసం లింక్​పై క్లిక్ చేయండి.

ఇదీ చదవండి: 'టీకా వేయాలని ప్రయత్నిస్తే.. పాముతో కరిపిస్తా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.