కేరళలో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. ఆ రాష్ట్రంలో కొత్తగా 18,067 కేసులు నమోదయ్యాయి. మరో 20,108 మంది కోలుకోగా.. మహమ్మారి ధాటికి 93 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 35.52 లక్షలకు చేరింది. ఇప్పటివరకు 17,747 మంది వైరస్ బారిన పడి మృతిచెందారు.
మహారాష్ట్రలో కొత్తగా 5,508 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 151 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో ఒక్కరోజే 1,598 మందికి వైరస్ నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా మరో 20 మంది చనిపోగా.. మరణాల సంఖ్య 36,793కు పెరిగింది.
మరోవైపు.. దిల్లీలో 66 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఎవరూ చనిపోలేదు.
మిగతా రాష్ట్రాల్లో ఇలా..
- తమిళనాడులో 1,956 కరోనా కేసులు వెలుగు చూశాయి. వైరస్ ధాటికి 28 మంది బలయ్యారు.
- ఉత్తర్‌ప్రదేశ్‌లో కొత్తగా 58 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్ కారణంగా కొత్త మరణాలేవీ నమోదు కాలేదు.
- బంగాల్లో కొత్తగా 675 మందికి వైరస్ సోకింది. కొవిడ్ కారణంగా మరో 12 మంది మరణించారు.
- గుజరాత్లో 25 కేసులు నమోదు కాగా.. మధ్యప్రదేశ్‌లో కొత్తగా 17 కరోనా కేసులు నమోదయ్యాయి.
- రాజస్థాన్‌లో మరో 15 మందికి కరోనా సోకినట్లు తేలింది.
- ఒడిశాలో కొత్తగా 1,315 మందికి వైరస్ సోకింది. కొవిడ్ కారణంగా మరో 66 మంది మరణించారు.
ఇదీ చూడండి: డెల్టా గుప్పెట్లో ప్రపంచదేశాలు- అమెరికాలో లక్షకుపైగా కేసులు
ఇదీ చూడండి: టీకా కేంద్రం వద్ద కర్రలతో కొట్టుకున్న జనం