నేడు, రేపు కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) (Kerala Rain updates) వెల్లడించింది. ఈ మేరకు అలప్పుజ, కొల్లాం, కాసరగోడ్ జిల్లాలకు ఎల్లో అలర్ట్, మిగతా 11 జిల్లాలకు 'ఆరెంజ్' అలర్ట్‌ను జారీ చేసింది ప్రభుత్వం. మత్యకారులు ఎవరూ శుక్రవారం వరకు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లకూడదని సూచించింది.
![kerala rains](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13403749_rains-478569.jpg)
![kerala rains](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13403749_rains-25445645.jpg)
![kerala rains](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13403749_rains-1447855.jpg)
వరద ఉద్ధృతి పెరగడం వల్ల అధికారులు ఇడుక్కి జలాశయం గేట్లు ఎత్తేసి నీటిని కిందకు వదిలారు.
వరద సహాయక చర్యలను పర్యవేక్షించాలను జిల్లా పాలనాధికారులకు ప్రభుత్వం సూచించింది. కొండ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున.. తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.
![kerala rains](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13403749_rains-2355.jpg)
![kerala rains](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13403749_rains.jpg)
![kerala rains](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13403749_rains-455.jpg)
"సహాయక చర్యలు చేపట్టేందుకు 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయి. వాయుసేన, నావికాదళం కూడా సిద్ధంగా ఉన్నాయి. వరద హెచ్చరికలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. వీటిపై అనవసరమైన వార్తలను వ్యాప్తి చేయడం ప్రజలకు మంచిది కాదు."
-కె. రాజన్, రెవెన్యూ శాఖ మంత్రి
39కి చేరిన మృతులు
కేరళలో కురిసిన భారీ వర్షాల కారణంగా 39 మంది చనిపోయినట్లు రెవెన్యూ శాఖ మంత్రి కె. రాజన్ తెలిపారు. మరో ఐదుగురు గల్లంతైనట్లు పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు.
ఇదీ చూడండి: వర్షాల దెబ్బకు ఉత్తరాఖండ్ విలవిల..