Kerala Onam Bumper Lottery Result 2023 : తమిళనాడు కోయంబత్తూర్‌కు చెందిన ఓ వ్యక్తికి రూ.25 కోట్ల భారీ లాటరీ తగిలింది. ఓనం సందర్భంగా కేరళ ప్రభుత్వం తీసిన లాటరీలో టికెట్ నంబర్ టీఈ 230662 కొన్న గోకులం నటరాజ్ అనే వ్యక్తి మొదటి విజేతగా నిలిచాడు. ఈ టికెట్‌ను పాలక్కడ్‌లోని వలయార్ డ్యామ్ సమీపంలోని భవ ఏజెన్సీ విక్రయించింది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ లాటరీ డ్రా తీశారు. ఈ 25 కోట్లలో 30 శాతం ట్యాక్స్ పోగా రూ. 17.5 కోట్లు అతడికి దక్కనున్నాయి.
కేరళ ప్రభుత్వం నిర్వహించే లాటరీల్లో అతిపెద్దది ఓనం లాటరీ. ఇందులో ప్రథమ బహుమతి రూ.25 కోట్లు. రెండో బహుమతి కోటి రూపాయలు కాగా.. వీటిని 20 మందికి ఇస్తారు. మూడో బహుమతిగా రూ.50 లక్షలు అందిస్తారు. రూ.500 విలువ గల ఈ టికెట్‌ను ఈసారి రికార్డు స్థాయిలో 90 లక్షలు ముద్రించారు. వీటిలో దాదాపు 75 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. అయితే, గతేడాది తీసిన ఓనం లాటరీలో కేవలం 11 లక్షల టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.
ఈ బంపర్ లాటరీలో గెలిచిన వ్యక్తులు డ్రా తీసిన తర్వాత 30 రోజుల్లోపు క్లెయిమ్ చేసుకోవాలి. రూ.5వేల లోపు బహుమతి అయితే.. నేరుగా లాటరీ కొనుగోలు చేసిన షాపునకు వెళ్లి తీసుకోవాలి. అంతకుమించిన నగదు అయితే.. వారి టికెట్లను బ్యాంకు లేదా ప్రభుత్వ లాటరీ కార్యాలయాల్లో ఇచ్చి నగదు తీసుకోవాలి.
రూ.కోట్లు కురిపిస్తున్న కేరళ లాటరీ.. మనం కొనచ్చా?.. రూల్స్ ఏంటో తెలుసా?
Kerala lottery : కేరళలో లాటరీలు రూ.కోట్లు కురిపిస్తున్నాయి. టికెట్ కొన్నవారికి కళ్లుచెదిరే ప్రైజ్ మనీని కట్టబెడుతున్నాయి. వందలు పెడితే రూ.కోట్లు వచ్చిపడుతున్నాయి కాబట్టి సాధారణంగానే దీనిపై అందరికీ ఆసక్తి ఉంటుంది. ఇటీవల ఈ ఆసక్తి ఇంకా ఎక్కువైంది. దేశవ్యాప్తంగా దీనిపై చర్చ మొదలైంది. కేరళ ప్రభుత్వం విక్రయిస్తున్న ఈ లాటరీల గురించి అందరూ ఆరా తీస్తున్నారు. టికెట్లు ఎలా కొనలానే విషయంపై గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు. ఈ నేపథ్యంలో లాటరీకి సంబంధించిన వివరాలు ప్రశ్నలు-సమాధానాల రూపంలో మీకోసం..
52ఏళ్లుగా లాటరీ టికెట్లు కొనుగోలు.. రూ.3.5కోట్లు ఖర్చు.. తీరా గెలిచింది ఎంతంటే..
అదృష్టమంటే ఇదేనేమో: జగిత్యాల వాసికి దుబాయ్‌లో రూ.30 కోట్ల లాటరీ..