ETV Bharat / bharat

'నాకింకా పెళ్లి కాలేదు.. అబ్బాయి ఉంటే చెప్పండి'.. పాటలు పాడుతూ ఎంపీ రిక్వెస్ట్ - రమ్యదాస్​ పెళ్లి రిక్వెస్ట్​

వరుడ్ని చూడమని చక్కటి పాటలు పాడి రిక్వెస్ట్ చేశారు ఓ కాంగ్రెస్​ ఎంపీ. తాను పెళ్లి చేసుకోవడానికి ఓ తమిళ అబ్బాయిని చూడాలని ఆమె నాయకులను కోరారు. ఈ సంఘటన తమిళనాడులోని ఈరోడ్​లో జరిగింది.

Kerala MP ask for groom by singing Tamil movie songs

author img

By

Published : Aug 1, 2022, 11:12 AM IST

Updated : Aug 1, 2022, 11:47 AM IST

వరుడ్ని చూడమని పాటతో కాంగ్రెస్​ ఎంపీ రిక్వెస్ట్

తమిళనాడులో ఈరోడ్​లో కొత్తగా ఎన్నికైన వార్డు మెంబర్లకు శిక్షణా కార్యక్రమం జరిగింది. ఆ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు లెనిన్ ప్రసాద్ నేతృత్వంలో ఆదివారం జరిగిన ఈ శిక్షణా కార్యక్రమానికి కేరళ ఎంపీ రమ్య హరిదాస్​తో పాటు పలువురు కాంగ్రెస్​ నాయకులు హాజరయ్యారు.

రమ్యదాస్​, కేరళ ఎంపీ
రమ్య హరిదాస్​, కేరళ ఎంపీ

కేరళ.. అలథూర్​ ఎంపీ రమ్య హరిదాస్.. తమిళనాడు యూత్ కాంగ్రెస్ నాయకుల్ని, ఆ పార్టీ వార్డ్ మెంబర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక్కసారిగా తమిళ పాటలు ఆలపించారు. కమల్ హాసన్​ 'మూన్రం పిరై' సినిమాలోని 'కన్నె కలైమానే' పాట, విజయకాంత్ 'ఆసై మచాన్' మూవీలో 'ఆదియిలా చేసిన సొల్లి' పాటలను​ పాడారు. ఆ సమయంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలంతా చప్పట్లు కొడుతూ ప్రోత్సహించారు. తనకు ఇంకా పెళ్లి కాలేదని, తమిళ అబ్బాయిని చూడమని నాయకులను కోరారు రమ్య​.

"నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్​ పరిధిలో కొంత భాగం తమిళనాడు సరిహద్దుల్లో ఉంది. పర్యటనల్లో భాగంగా అక్కడకు వెళ్లినప్పుడు.. నేను తమిళ భాష​లోనే వారితో మాట్లాడతాను. అందుకే తమిళ అబ్బాయిని చూడండి. వివాహం చేసుకుంటాను."

-- రమ్య హరిదాస్​, కాంగ్రెస్ ఎంపీ

ఎవరీ రమ్య హరిదాస్​?
కేరళలో అలథూర్​ లోక్​సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రమ్య హరిదాస్​.. సామాన్య కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె తల్లి ఇంట్లో బట్టలు కుడితే.. తండ్రి రోజువారీ కూలి పనులకు వెళ్లేవారు. గతంలో కాంగ్రెస్​ ప్రభుత్వం.. ఇందిరమ్మ ఇళ్లు పథకం కింద ఇచ్చిన ఇంట్లోనే ఇప్పటికీ రమ్య కుటుంబం నివాసం ఉంటోంది.

రమ్య.. పదో తరగతి తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్​లో డిప్లొమా కోర్సు చేశారు. 2019లో జరిగిన లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ తరఫున పోటీ చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి పీకే బిజుపై 1,58,968 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఎన్నికల ప్రచారంలోనూ రమ్య.. పాటలు పాడుతూ జనాలను హుషారెత్తించేవారు. ప్రచారంలో ఆమె పాటలను వినడానికి చాలా మంది తరలివచ్చేవారు.

ఇవీ చదవండి: ముష్కరుల తూటాలకు బెదరని శునకం.. విధి నిర్వహణలో ప్రాణ త్యాగం

ఘోరం.. కరెంట్​ షాక్​తో 10 మంది మృతి.. వ్యాన్​లోని డీజే సిస్టమ్​ వల్లే!

Last Updated : Aug 1, 2022, 11:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.