Monsoon Kerala date : జూన్ 4న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. శుక్రవారం దీనికి సంబంధించిన వివరాలను ఐఎండీ వెల్లడించింది. జూన్ 1న.. దేశంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తాము భావించట్లేదని వివరించింది.
ఈ సంవత్సరం వాయవ్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. వచ్చే వారం రోజుల్లో అరేబియా సముద్రంలో తుపాను వచ్చే అవకాశాలు కూడా లేవని సృష్టం చేసింది. ఉత్తరాదిన రుతుపవనాలకు ముందుగానే వర్షాలు పడడానికి.. పాశ్చాత్య దేశాల్లో వాతవరణ అసమతుల్యతే కారణమని వెల్లడించింది.
"పాశ్చాత్య దేశాల్లో వాతావరణ అసమతుల్యత కారణంగానే.. భారత్‌లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అందుకే దిల్లీతో పాటు చుట్టుపక్క నగరాలు కాస్త ఉపశమనాన్ని పొందుతున్నాయి. ఒకవేళ దేశం మొత్తం ఒకే తరహాలో వర్షపాతం నమోదైతే అనుకూల పరిస్థితులే ఉంటాయి. అప్పుడు ఎటువంటి సమస్య ఉండదు. వ్యవసాయంపై కూడా ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదు" అని భారత వాతావరణ శాఖ తెలిపింది.
సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1 నుంచి 7 రోజుల వ్యవధిలో కేరళలో అస్తమిస్తాయి. 2022 మే 29న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. అప్పుడు భారత వాతవరణ శాఖ మే 27న రుతుపవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేసింది. కానీ రెండు రోజుల తరువాత అవి దేశంలోకి వచ్చాయి. గత 18 సంవత్సరాలుగా రుతుపవనాల విషయంలో కచ్చితమైన అంచనా వేస్తున్నట్లు వాతావరణ శాఖ వివరించింది. 2015లో మాత్రం తమ లెక్క తప్పినట్లు పేర్కొంది. కాగా 2005 నుంచి కేరళకు రుతుపవనాల రాకను అంచనా చేసి.. వాటి వివరాలను వెల్లడిస్తోంది వాతావరణ శాఖ.
IMD Rain Forecast 2023 : 2023లో నైరుతి రుతుపవనాల కారణంగా సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ విభాగం- ఐఎండీ అంచనా వేసింది. హిందూ మహాసముద్ర ద్విధ్రువ, ఉత్తర అర్ధగోళంలోని పరిస్థితుల కారణంగా ఎల్‌నినో ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. సీజన్ ద్వితీయార్థంలో ఈ ప్రభావం కనిపించవచ్చని వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత వాతావరణ శాఖ ఈ వివరాలను తెలియజేసింది.
ఐఎండీ అంచనాల ప్రకారం..
- భారత్‌లోని వాయవ్య, పశ్చిమ, మధ్య, ఈశాన్య ప్రాంతాల్లో సాధారణం నుంచి లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
- తూర్పు భారతం, ఈశాన్య, వాయవ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం ఉంటుంది.
- వర్షాకాలంలో ఎల్ నినో పరిస్థితులు ఏర్పడవచ్చు. సీజన్ ద్వితీయార్థంలో ఈ ప్రభావం కనిపించవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇవీ చదవండి:
- యువ జంట కిరాతకం.. హోటల్ రూమ్‌లో వృద్ధుడి హత్య.. శరీరాన్ని ముక్కలు చేసి సూట్‌కేస్‌లో..
- స్టూడెంట్స్ ఎదుటే మహిళా టీచర్ల ఫైట్.. చెప్పులతో కొడుతూ, జుట్టు లాగుతూ..