కుడి నుంచి ఎడమకు రాసే అరబిక్ భాషలో ఆరి తేరిన ఓ యువకుడు అరుదైన ఘనత సాధించాడు. కేరళలోని పాలక్కడ్ జిల్లా పుడుసెరికి చెందిన 24 ఏళ్ల అబ్దుల్ జలీల్.. జాతీయ గీతాన్ని అరబిక్‌లో ఎడమ నుంచి కుడికి, కింద నుంచి పైకి రాసి రికార్డ్ నెలకొల్పాడు. మన్నర్కడ్ తహసీల్దార్ ఎన్ఎం రఫీ పర్యవేక్షణలో కేవలం రెండు నిమిషాల 47 సెకన్లలో రాయడం పూర్తి చేశాడు.
కన్నూరు విశ్వవిద్యాలయంలో అరబిక్‌లో పీజీ చేస్తున్న సమయంలో సరదాగా జలీల్ చేసిన ప్రయత్నమే అతడిని రికార్డ్ నెలకొల్పేలా చేసింది. విరామ సమయాల్లో అరబిక్‌ను తిరగరాసే ప్రయత్నం చేస్తున్న జలీల్‌ను చూసి అతని స్నేహితులు ప్రోత్సహించారు.
లాక్డౌన్లో..
గతేడాది లాక్డౌన్ సమయంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గురించి తెలుసుకున్న జలీల్.. తన అభిరుచిపై మరింత కృషి చేశాడు. ఇందుకోసం ప్రతిరోజు రాత్రి 2 గంటలు సమయం కేటాయించాడు. మొదట 100 మంది అమరుల పేర్లను రాయలని అనుకున్నాడు. కానీ వాటిని అరబిక్‌లో నేర్చుకునేందుకు సమయం పడుతుండటం వల్ల జాతీయ గీతంపై కసరత్తులు ప్రారంభించాడు. నెలన్నర సాధన తర్వాత చేసిన మొదటి ప్రయత్నంలోనే జలీల్ ఈ ఘనత సాధించాడు.
ఇదీ చదవండి : తమిళనాట 'రాజకీయ శూన్యత' నిజమా? భ్రమా?