ETV Bharat / bharat

అతని మార్నింగ్​ వాక్​.. పర్యావరణానికి ఓ వరం! - కేరళలో మార్నింగ్ వాక్​

అందరూ పర్యావరణ పరిరక్షణ కోరుకునే వాళ్లే! కానీ ఎంత మంది అందుకు ముందుకొస్తారు. ఎంత మంది ఆ బాధ్యత నిర్వహిస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు కొంచెం కష్టమే! అయితే కేరళకు చెందిన ఓ రైతు.. ఆ దిశగా కృషి చేస్తున్నారు. ఉదయం వేళల్లో ప్లాస్టిక్​ బాటిళ్లు సేకరిస్తూ.. అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

waste plastic bottle
మార్నింగ్​ వాక్
author img

By

Published : Jul 8, 2021, 3:31 PM IST

ప్లాస్టిక్​ బాటిళ్లు సేకరిస్తున్న రాజన్​

ప్రతి రోజు మనం చెత్త సేకరించే వాళ్లను చూస్తుంటాం. అందులో కొందరు తమ విధుల్లో భాగంగా చేస్తుంటే.. మరికొందరు వ్యర్థాలను అమ్ముకొని జీవనం సాగిస్తుంటారు. కానీ.. పర్యావరణంపై ప్రేమతో చెత్తను సేకరించే వారు చాలా అరుదు. ఆ కోవకు చెందినవారే.. కేరళలోని కొజికోడ్​ జిల్లాకు చెందిన రాజన్.

waste plastic bottle
.

పొలంలో కలుపు ఎక్కువైతే పంట చెడుపోతుంది. అలాగే చెత్త పేరుకుపోతే పర్యావరణానికి హాని జరుగుతుంది. అందుకే అతను వృత్తి రీత్యా రైతే అయినా.. పొలంలో కలుపును తీసినట్లే పరిసరాల్లో చెత్తను సేకరిస్తున్నారు. అందుకే ఆయన్ని స్థానికులు 'కుప్పి రాజన్'​ అని పిలుస్తారు.

గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. వైద్యుల సలహా మేరకు రోజూ ఉదయపు నడకను ప్రారంభించారు. అదే సమయంలో ప్లాస్టిక్​ వ్యర్థాలను సేకరించడం మొదలు పెట్టారు.

Kerala man waste plastic bottle
రాజన్ సేకరించిన ప్లాస్టిక్ బాటిళ్లు

చెమంచేరి గ్రామ పంచాయతీ పరిసర ప్రాంతాల్లో రాజన్​ రోజూ ఉదయం.. బహిరంగ ప్రదేశాల్లో కనిపించిన ప్లాస్టిక్ బాటిళ్లు, పర్యావరణానికి హాని చేసే ఇతర వస్తువులను సేకరిస్తున్నారు. ఈ పని చేయడానికి ఆయనెప్పుడూ ఇబ్బంది పడలేదు. సేకరించిన వ్యర్థాలను తన ఇంటి ముందే పోగు చేస్తారు. కేవలం మూడు నెలల్లోనే పంచాయతీలోని రెండు వార్డుల్లో ప్లాస్టిక్​ వ్యర్థాలను పూర్తిగా తొలగించినట్లు రాజన్ తెలిపారు.

"ఈ కుప్ప అంతా రెండు వార్డుల్లో సేకరించిందే. ఇందులో అప్పుడప్పుడు రహదారులపై తీసుకొచ్చిన బాటిళ్లు కూడా ఉన్నాయి. ఇది పర్యావరణం పట్ల ప్రజల నిర్లక్ష్యాన్ని చూపుతుంది. నేను డబ్బు కోసం ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తున్నానని, పిచ్చివాడినని.. ప్రజలు హేళన చేస్తున్నారు. నేను దాని గురించి బాధపడటం లేదు. చాలా కంపెనీలు నన్ను సంప్రదిస్తున్నాయి. వీటిని రెండు నెలల తర్వాత గుజరాత్​ లేదా ఇతర ప్రదేశాలకు పంపుతాను. వీటిని జీన్స్, దుప్పటి, చీరల తయారీలో ఉపయోగిస్తున్నారు."

- రాజన్​, రైతు

ప్లాస్టిక్ బాటిళ్లను వేటికవి వేరు చేసి పోగు చేశారు రాజన్​​. ప్రజలు తమ ప్లాస్టిక్ వ్యర్థాలను సక్రమంగా పారవేసేందుకు రెండు వార్డులలో చెత్త కుండీలను సైతం ఏర్పాటు చేసినట్లు రాజన్​ చెప్పారు.

ఇదీ చూడండి: Twitter: '8 వారాల్లో ఆ అధికారిని నియమిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.