కేవలం 30 సెకండ్లలో 50 క్లాప్ పుష్అప్స్ చేసిన ఘనత దక్కించుకున్నాడు కేరళ యువకుడు లిను అబ్రహాం. దీంతో ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అతడికి స్థానం లభించింది. పతనంతిట్టాకు చెందిన లిను.. ఈ రికార్డుతో స్థానికంగా హీరో అయిపోయాడు.
ప్రస్తుతం లిను.. ఓ జిమ్‌లో వ్యక్తిగత శిక్షకునిగా పనిచేస్తున్నాడు. అతడు 2017లో 60కేజీల విభాగంలో మిస్టర్ పతనంతిట్టగానూ గౌరవం పొందాడు.
నాన్నే స్ఫూర్తి..
తనకు స్ఫూర్తి, ఆర్మీ నుంచి పదవీ విరమణ పొందిన తన తండ్రేనని తెలిపాడు లిను. ఫిజికల్ ట్రైనర్‌గానూ పనిచేసిన ఆయన అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు.
యువత అలా చేయాలి..
ఇంగ్లీష్ లిటరేచర్‌లో పట్టాపొందిన లిను.. ఫిజికల్ ఎడ్యుకేషన్‌లోనూ డిగ్రీ పూర్తి చేశాడు. ఆన్లైన్ తరగతులను కూడా నిర్వహిస్తాడు. యువత వ్యాయామాన్ని తమ జీవితాల్లో భాగం చేసుకొని, ఆరోగ్యంగా ఉండాలని చెబుతున్నాడు.
ఇదీ చూడండి: విద్యార్థులతో స్టెప్పులేసి అదరగొట్టిన రాహుల్