దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు స్థిరంగా పెరుగుతూనే ఉన్నాయి. దిల్లీలో వైరస్ వ్యాప్తి అధికంగా కనిపిస్తోంది. దేశ రాజధానిలో మరో 7,053 కరోనా కేసులు బయటపడ్డాయి. మొత్తం బాధితుల సంఖ్య 4.67లక్షలు దాటింది. మరో 104 మంది కరోనాకు బలవ్వగా.. మొత్తం మృతుల సంఖ్య 7,332కు పెరిగింది.
- కేరళపైనా మహమ్మారి పంజా విసురుతోంది. ఈ రాష్ట్రంలో ఒక్కరోజులోనే 5,804 మంది కొవిడ్ బారినపడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య 5లక్షల 14వేల 642కు పెరిగింది. మరో 26 మంది చనిపోవడం వల్ల.. మృతుల సంఖ్య 1,822కు ఎగబాకింది.
- మహారాష్ట్రలో శుక్రవారం ఒక్కరోజే 4,132 మంది కరోనా కేసులు బయటపడ్డాయి. బాధితుల సంఖ్య 17లక్షల 40వేల 461కి పెరిగింది. వైరస్ కారణంగా మరో 127 మంది ప్రాణాలు కోల్పోగా.. మరణాల సంఖ్య 45వేల 809కి ఎగబాకింది.
- పశ్చిమ్‌బంగాలో కొత్తగా 3,835 మందికి కరోనా సోకింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 4లక్షల 24వేల 675కు చేరింది. వైరస్ ధాటికి మరో 51 మంది చనిపోయారు.
- హరియాణా రాష్ట్రంపై కొవిడ్ పంజా విసురుతోంది. ఆందోళనకర స్థాయిలో ఒక్కరోజులోనే 2,688 కరోనా కేసులు నమోదయ్యాయి.
- ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో 2,183 మందికి మహమ్మారి సోకినట్టు తేలింది. మొత్తం కేసుల సంఖ్య 5లక్షల 7వేల 602కు చేరింది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 7,327 మంది కరోనాతో మృతి చెందారు.
- కర్ణాటకలో మరో 2,016 కరోనా కేసులు బయటపడ్డాయి. బాధితుల సంఖ్య 8లక్షల 57వేల 928కు చేరింది. మరో 17 మరణాలతో.. చనిపోయిన వారి సంఖ్య 11,491కి పెరిగింది.
- తమిళనాడులో కొత్తగా 1,939 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. కేసుల సంఖ్య 7లక్షల 54వేల 460కి ఎగబాకింది. ఇప్పటివరకు అక్కడ 11వేల 454 కరోనా మరణాలు నమోదయ్యాయి.
ఇదీ చదవండి: మహా దీపోత్సవ వెలుగుల్లో పులకించిన అయోధ్య