దేశంలో కరోనా తీవ్రత స్వల్పంగా తగ్గింది. కొవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న కేరళలో (kerala covid cases) తాజాగా 17,681 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మరో 208 మంది ప్రాణాలు కోల్పోయారు. 25,588 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.
బంగాల్లో ఆంక్షలు(Bengal curfew)..
కరోనా తీవ్రత దృష్ట్యా.. బంగాల్లో సెప్టెంబర్ 30 వరకు ఆంక్షలు విధిస్తూ(Bengal curfew).. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని ప్రోత్సహించాలని సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు బహిరంగ కార్యకలాపాలను నిషేధిస్తున్నట్లు పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించింది. బంగాల్లో బుధవారం కొత్తగా 703 కరోనా కేసులు బయటపడ్డాయి. 713 మంది కోలుకోగా.. 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు..
- మహారాష్ట్రలో కొత్తగా 3,783 నమోదయ్యాయి. 56 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 4,364 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
- తమిళనాడులో కొత్తగా 1,658 కేసులు నమోదయ్యాయి. మరో 29 మంది మృతిచెందారు.
- కర్ణాటకలో కొత్తగా 1,116 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి కారణంగా మరో 8 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మిజోరంలో కొత్తగా 1,185 మందికి కరోనా సోకింది. వీరిలో 240 మంది చిన్నారులు కూడా ఉన్నారు. వైరస్ ధాటికి మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
- ఒడిశాలో మరో 457మందికి వైరస్ సోకింది. 793 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.
దేశవ్యాప్తంగా బుధవారం.. 57 లక్షల టీకా డోసులు(vaccination in india) పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. దీంతో మొత్తం వ్యాక్సినేషన్(vaccination in india) సంఖ్య 76కోట్లు దాటినట్లు తెలిపింది.
ఇదీ చదవండి: 'స్పుత్నిక్ లైట్' మూడోదశ ట్రయల్స్‌కు డీసీజీఐ ఆమోదం