ETV Bharat / bharat

ఫుట్​బాల్​ను ఆటాడేసిన 'అఖిల'కు ప్రపంచ రికార్డు - ఫుట్​బాల్​ జగ్లింగ్​

కేరళలోని కన్నూర్​ ప్రాంతానికి చెందిన ఓ బాలిక ఫుట్​బాల్​ జగ్లింగ్​లో ప్రపంచ రికార్డు సాధించింది. పదమూడేళ్ల ఆ అమ్మాయి.. ఒక్క నిమిషంలోనే 171 సార్లు బంతిని నేలకు తాకకుండా తన కాళ్లపై ఆడిస్తూ ఈ ఘనతను సొంతం చేసుకుంది. అంతకుముందు ఈ రికార్డు బ్రెజిల్​ జగ్లర్​ పేరిట ఉండేది.

Kerala girl sets world record in football juggling
ఫుట్​బాల్​ను ఆటాడేసిన 'అఖిల'కు ప్రపంచ రికార్డు
author img

By

Published : Dec 6, 2020, 4:22 PM IST

Updated : Dec 6, 2020, 4:35 PM IST

ఫుట్​బాల్​ను ఆటాడేసిన 'అఖిల'కు ప్రపంచ రికార్డు

కేరళలోని ఉత్తర మలబార్​ వాణిజ్య కేంద్రంగా పేరుగాంచిన పాళంగోడ్​.. ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కింది. కన్నూర్​లోని చెరుకున్ను ప్రాంతానికి చెందిన ఓ బాలిక ఫుట్​బాల్​ జగ్లింగ్​లో ప్రపంచ రికార్డు నెలకొల్పడం వల్ల ఈ ఖ్యాతి దక్కింది. పదమూడేళ్లకే ఫుట్​బాల్​ క్రీడపై ఆసక్తి పెంచుకున్న అఖిల.. జగ్లింగ్​లో ప్రపంచ రికార్డును తిరగరాసింది. ఒక్క నిమిషం వ్యవధిలో 171 సార్లు బంతిని నేలకు తాకనివ్వకుండా తన కాళ్లపై ఆడిస్తూ ఈ ఘనత సాధించింది అఖిల. ఫలితంగా బ్రెజిలియన్​ జగ్లర్​ జోషువా డ్యురెట్టే​ పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది.

Kerala girl sets world record in football juggling
బంతిని నేలకు తాకకుండా ఆడిస్తూ..

కన్నూర్​లోని స్పోర్ట్స్​ డివిజన్​ స్కూల్​లో ఏడో తరగతి చదువుతోన్న అఖిల.. పిన్న వయసులోనే రాష్ట్ర క్రీడా శిక్షణా కార్యక్రమం 'కిక్​ ఆఫ్​'లో తర్ఫీదు పొందింది. ఇలా తన నైపుణ్యానికి శిక్షణను కలబోసి బంతిపై కాళ్లపై ఆడించే ఆటలో మరింత రాటుదేలిందీ బాలిక.

ప్రపంచ రికార్డు సృష్టించిన అఖిల

తల్లిదండ్రుల హర్షం

అఖిల ప్రదర్శనపై ఆనందం వ్యక్తం చేశారు ఆమె తల్లిదండ్రులు బిజు, లీమా మేరీ. చిన్నప్పటి నుంచే అఖిలకు ఫుట్​బాల్​ అంటే ఎంతో ఇష్టమని వారు చెప్పుకొచ్చారు. అఖిల సోదరి అనీషా తైక్వాండో ప్లేయర్​ కావడం విశేషం.

తండ్రితో కలిసి సాధన చేస్తూ..

అఖిల కుటుంబ సభ్యులు

ఇదీ చదవండి: 'గడ్డం' ఛాంపియన్​కు అవార్డులు దాసోహం

Last Updated : Dec 6, 2020, 4:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.