Kerala Girl Chases: కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఇటీవలే దోపిడీ దొంగలతో సివంగిలా పోరాడి ఎందరిలోనో స్ఫూర్తి నింపింది ఓ గుజరాతీ యువతి. కేరళలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. బస్సులో లైంగికంగా వేధించడానికి యత్నించిన ఓ కామాంధుడిని ఛేజ్ చేసి పట్టుకొని మరీ పోలీసులకు అప్పగించింది 21 ఏళ్ల వీరవనిత!
ఏం జరిగిందంటే..: కేఎస్ఆర్టీసీలో కరివళ్లూర్ నుంచి కన్హన్గఢ్కు ప్రయాణిస్తోంది 21 ఏళ్ల యువతి. ఈ క్రమంలో లుంగీలో ఉన్న ఒక వ్యక్తి ఆమెను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. దూరంగా జరగమని పదేపదే అడిగినా.. అతడు ఆమె వెనకాల నిలబడి అనుచితంగా ప్రవర్తిస్తూనే ఉన్నాడు. దీంతో ఫోన్ తీసుకొని పింక్ పోలీసులకు కాల్ చేసింది. ముప్పును గుర్తించి సదరు వ్యక్తి.. తర్వాతి స్టాప్‌లో బస్ దిగేశాడు.
అయితే ఇలాంటి నీచుడిని అంత సులువుగా వదిలేయకూడదని ఆ యువతి భావించింది. ఆమె కూడా బస్ దిగి అతడిని వెంబడించింది. పరిగెత్తుకుంటూ వెళ్లి.. అతడో లాటరీ కొట్టు ముందు నిల్చున్నాడు.. వినియోగదారుడిలా! షాప్ ఓనర్ దగ్గరికి వెళ్లిన యువతి.. ఘటన గురించి వివరించింది. స్థానికులతో కలిసి నిందితుడిని పట్టుకున్నారు ఆ యజమాని. అనంతరం పోలీసులు వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కాసర్‌గఢ్‌కు చెందిన 52 ఏళ్ల రాజీవ్‌గా పోలీసులు గుర్తించారు. గతంలోనూ ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్నట్లు చెప్పింది సదరు యువతి. కన్హన్గఢ్ నెహ్రూ కళాశాలలో గ్రడ్యూయేషన్ పూర్తి చేసిన ఆమె.. కాలేజీ రోజుల్లో ఎన్సీసీ సీనియర్ అండర్ ఆఫీసర్‌గా కూడా ఉంది.
ఇదీ చూడండి: గర్భంతో ఉన్న 'మేక'పై గ్యాంగ్ రేప్, హత్య