ETV Bharat / bharat

500 ప్రభుత్వ ఫైళ్లు మిస్సింగ్- అక్రమ కొనుగోళ్లకు సంబంధించినవే! - ప్రభుత్వ ఫైళ్లు మిస్సింగ్ కేరళ

Kerala files missing: ప్రభుత్వ పత్రాలంటే అత్యంత జాగ్రత్తగా భద్రపరుస్తారని అనుకుంటాం. కానీ, కేరళ వైద్య శాఖ తీరు చూస్తే ఆ విషయంపై అనుమానాలు కలగక మానదు. వైద్య శాఖకు చెందిన 500కు పైగా పత్రాలు కనిపించకుండా పోవడం ఈ అనుమానాలకు కారణమవుతోంది.

Kerala Health Department files missing
వైద్య శాఖ అక్రమ కొనుగోళ్లు- 500 ఫైళ్లు మిస్సింగ్
author img

By

Published : Jan 8, 2022, 7:47 PM IST

Kerala files missing: కేరళ వైద్య శాఖ అధీనంలో ఉండాల్సిన అధికారిక పత్రాలు కనిపించకుండా పోవడం కలకలం రేపుతోంది. 500కు పైగా కీలక ఫైళ్లు కనిపించడం లేదని తెలుస్తోంది. ఔషధాలు, వైద్య పరికరాల కొనుగోలు విషయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయన్నాయని వైద్య శాఖపై ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. కీలక పత్రాల ఆచూకీ లేకపోవడం అనుమానాలతు తావిస్తోంది.

Kerala health dept files missing

వైద్య శాఖ సంచాలకులు పోలీసులకు సమాచారం అందించిన తర్వాత పత్రాలు కోల్పోయిన విషయం వెలుగులోకి వచ్చింది. ఔషధాల కొనుగోళ్లకు సంబంధించి 'మెడికల్ సర్వీస్ కార్పొరేషన్' జరిపిన లావాదేవీల వివరాలు ఈ పత్రాల్లో ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు మరికొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది.

500 files missing Kerala

ఈ వ్యవహారంపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. వైద్య శాఖలో పనిచేసే అధికారుల్లోనే కొందరు హస్తవాటం ప్రదర్శించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉద్యోగుల ప్రమేయం లేకుండా దస్త్రాలు కనిపించకుండా పోయే అవకాశమే లేదని పోలీసులు భావిస్తున్నారు.

ఇటీవల వైద్య శాఖ కార్యాలయాన్ని ఇటీవల ఇతర ప్రాంతానికి తరలించారు. మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో వేరే చోట తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశారు. అయితే, ఈ సమయంలో దస్త్రాలు పోయి ఉంటాయని అనుకోవడం లేదని ఉద్యోగులు చెబుతున్నారు.

అయితే, విచారణలో వైద్య శాఖ ఉద్యోగులు సరైన సమాచారం అందించడం లేదని పోలీసులు చెబుతున్నారు. వైద్య శాఖ అధికారులు తమకు సహకరించాలని కోరుతున్నారు. మరోవైపు, వైద్య శాఖ ఉన్నతాధికారులు సైతం ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఒమిక్రాన్ వల్లే దేశంలో మూడోవేవ్- ఫిబ్రవరిలో తీవ్రస్థాయికి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.