ETV Bharat / bharat

కేరళ ఎన్నికలు: సీపీఎం తొలి జాబితా విడుదల - లోక్​ తాంత్రిక్​ జనతా దళ్

కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సీపీఎం తమ అభ్యర్థులను ప్రకటించింది. 83 మందితో కూడిన తొలి జాబితాను పార్టీ రాష్ట్ర కార్యదర్శి విడుదల చేశారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్​.. ధర్మదామ్​ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.

kerala-cpi-m-releases-list-of-85-candidates-for-the-assembly-elections
కేరళ ఎన్నికలు: సీపీఎం తొలి జాబితా విడుదల
author img

By

Published : Mar 10, 2021, 1:25 PM IST

Updated : Mar 10, 2021, 2:19 PM IST

కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సీపీఎం మొదటి జాబితాను ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏ.విజయ రాఘవన్​​ 83 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో 33 మంది సిట్టింగ్​ ఎమ్మెల్యేలు సహా.. ఐదుగురు మంత్రులకు టికెట్లు దక్కలేదు.

ముఖ్యమంత్రి పినరయి విజయన్ ధర్మదామ్​ నియోజకవర్గం నుంచి పోటీ చేయనుండగా.. ప్రస్తుత ఆరోగ్యమంత్రి కేకే.శైలజ మత్తనూర్​ నుంచి, విద్యాశాఖ మంత్రి కేటీ జలీల్​ థవనూర్​ నుంచి బరిలో నిలవనున్నారు. మొత్తం 12 మంది మహిళా అభ్యర్థులు బరిలో నిలిచారు.

ఇక సీట్ల పంపకాల్లో భాగంగా.. కేరళ కాంగ్రెస్​కు 13 స్థానాలు కేటాయించారు. మరో మిత్రపక్షం లోక్​ తాంత్రిక్​ జనతా దళ్​(ఎల్​జేడీ) మూడు స్థానాల్లో పోటీ చేయనుండగా.. తొమ్మిది స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ఇవ్వనున్నట్లు సీపీఎం ప్రకటించింది.

కొత్త అభ్యర్థులకు అవకాశమిచ్చేందుకే సిట్టిం​గ్​లకు టికెట్లు నిరాకరించామని విజయ రాఘవన్​ వివరణ ఇచ్చారు.

సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ వరుసగా రెండోసారి అధికారంలోకి రావడంపై దృష్టి సారించింది. 2016 ఎన్నికల్లో 140 సీట్లలో పోటీ చేసిన ఎల్‌డీఎఫ్ 91 స్థానాల్లో విజయం సాధించింది.

ఇదీ చదవండి: అసోం, బంగాల్​ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా

Last Updated : Mar 10, 2021, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.