ETV Bharat / bharat

అతడికి మరణదండన, 92ఏళ్లు జైలుశిక్ష.. బాలుడ్ని చంపి, బాలికను రేప్​ చేసిన కేసులో తీర్పు

ఓ వ్యక్తికి మరణశిక్షతోపాటు 92 ఏళ్ల జైలు శిక్ష విధించింది ఇడుక్కి స్పెషల్​ పోక్సో కోర్టు. ఆరేళ్ల బాలుడిని హత్య చేసి, అతడి 14 ఏళ్ల సోదరిని అత్యాచారం చేసిన కేసులో ఈ జైలుశిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది.

Death Sentenced for accused in Idukki murder case

author img

By

Published : Jul 22, 2023, 7:33 PM IST

Updated : Jul 22, 2023, 8:13 PM IST

ఆరేళ్ల బాలుడిని హత్య చేసి, అతడి 14 ఏళ్ల సోదరిని అత్యాచారం చేసిన కేసులో ఓ వ్యక్తికి మరణశిక్షతో పాటు ఏకంగా 92 సంవత్సరాల జైలుశిక్ష విధించింది కేరళలోని ఇడుక్కి స్పెషల్​ పోక్సో కోర్టు. దీంతో పాటు బాలిక కిడ్నాప్​, రేప్​ సహా ఆమె తల్లి, బామ్మపై దాడి కేసుల్లో విడివిడిగా నాలుగు యావజ్జీవ శిక్షలు విధించింది న్యాయస్థానం. వీటితో పాటు ఇతర సెక్షన్ల కింద కోర్టు వేసిన శిక్షా కాలం కలిపితే 92 సంవత్సరాలు అవుతుంది. ఈ శిక్షతో పాటు దోషికి రూ.9,91 లక్షల జరిమానా సైతం వేసింది. ఒకవేళ జరిమానా చెల్లించకపోతే.. మరో 11 సంవత్సరాలు అదనంగా శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చింది. దాదాపు 73 మంది సాక్షులను విచారించిన కోర్టు.. ఘటన జరిగిన తర్వాత 20 నెలలకు తీర్పునిచ్చింది.

ఇదీ జరిగింది
ఈ ఘటన ఇడుక్కి జిల్లాలోని అణాంచల్​ సమీపంలో జరిగింది. 2021 అక్టోబర్​ 2న తెల్లవారుజామున 3 గంటలకు తలుపులు పగులగొట్టి బాధితుల ఇంట్లోకి ప్రవేశించాడు దోషి. మొదట ఆరేళ్ల బాలుడి తలపై సుత్తితో కొట్టి చంపాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న వృద్ధురాలిపై దాడి చేశాడు. అనంతరం పక్క గదిలో ఉన్న మహిళ తలపైనా దాడి చేశాడు. అక్కడే ఉన్న 14 ఏళ్ల బాలికను షెడ్​లోకి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లి చుట్టుపక్కల వారికి చెప్పడం వల్ల ఈ విషయం బయటపడింది. దోషి.. బాధితుల బంధువేనని.. కుటుంబ వివాదాల కారణంగానే ఇలా చేశాడని దర్యాప్తులో తేలింది.

ఇద్దరు నేపాలీ బాలికలపై గ్యాంగ్​రేప్​.. ముగ్గురికి జీవిత ఖైదు
ఇద్దరు నేపాలీ బాలికలపై గ్యాంగ్​రేప్ కేసులో ముగ్గురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది ఉత్తర్​ప్రదేశ్​లోని బలరాంపుర్​ స్పెషల్​ పోక్సో కోర్టు. మరో వ్యక్తికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. శిక్షతో పాటు ముగ్గురికి రూ. 65,000.. మరో వ్యక్తికి రూ.15వేల జరిమానా విధించింది.

ఇదీ జరిగింది
నేపాల్​కు చెందిన ఇద్దరు బాలికలు.. 2022 జున్​ 26న ఇండియా-నేపాల్ సరిహద్దులో ఉన్న మణిపుర్ మార్కెట్​కు అడవి గుండా వెళ్తున్నారు. ఈక్రమంలోనే నలుగురు యువకులు వారిని ఎత్తుకెళ్లి చెట్టుకు కట్టేశారు. అనంతరం వారిపై సామూహిక అత్యాచారం చేసి పరారయ్యారు. ఆ తర్వాత అక్కడ నుంచి తప్పించుకున్న బాలికలు.. ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్నంతా చెప్పారు. నేపాల్​ పోలీసుల సహాయంతో హరౌయా పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు కుటుంబసభ్యులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి.. నలుగురిని అరెస్ట్ చేశారు. వీరిని రామ్​చందర్​, రాజేంద్ర పాశ్వాన్​, రాకేశ్ పాశ్వాన్, పింటూగా గుర్తించారు.

Last Updated : Jul 22, 2023, 8:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.