కేరళలో కరోనా వైరస్ ఆందోళనకర స్థాయిలో విస్తరిస్తోంది. కొద్దిరోజులుగా రోజుకు సగటున 5వేల మందికిపైగా కొవిడ్ బారినపడుతున్నారు. ఆదివారం ఒక్కరోజే 5,711 వైరస్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా బాధితుల సంఖ్య 7.05 లక్షలకు చేరింది. మహమ్మారి ధాటికి మరో 30 మంది మరణించగా.. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2,816కు ఎగబాకింది. పాజిటివ్ రేటు 10.6గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.
- మహారాష్ట్రలో కొత్తగా 3,811 మందికి వైరస్ నిర్ధరణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 18.96 లక్షలకు పెరిగింది. వైరస్‌తో పోరాడుతూ మరో 98 మంది చనిపోగా.. మృతుల సంఖ్య 48వేల 746కి చేరింది.
- ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక్కరోజులోనే 1,247 మంది కొవిడ్ బారినపడ్డారు. కేసుల సంఖ్య 5.74 లక్షలకు ఎగబాకింది. వైరస్ ధాటికి మరో 19 మంది బలవ్వగా.. చనిపోయిన వారి సంఖ్య 8,196కు చేరింది.
- కర్ణాటకలో శనివారం రోజు 1,194 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 9.09లక్షల చేరింది. వైరస్‌తో మరో 5 మంది చనిపోగా.. మరణాల సంఖ్య 12,009 గా ఉంది.
- తమిళనాడులో ఒక్కరోజులోనే 1,114 వైరస్ కేసులు నమోదయ్యాయి. బాధితుల సంఖ్య 8లక్షల 6వేలు దాటింది. ఇప్పటివరకు అక్కడ 11,983 మంది కరోనాకు బలయ్యారు.
- దేశ రాజధాని దిల్లీలో మరో 1,091 కరోనా కేసులు బయటపడ్డాయి. బాధితుల సంఖ్య 6లక్షల 17వేలు దాటింది. దిల్లీలో ఇప్పటివరకు 10,277 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.