కేరళ రోజువారీ కరోనా కేసుల(Kerala Covid Cases) సంఖ్య క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. ఆ రాష్ట్రంలో కొత్తగా 12,161 కేసులు(Kerala Covid Cases) వెలుగు చూశాయి. మరో 155 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. మరో 17,862 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
మహారాష్ట్రలో 3,187 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్ ధాటికి మరో 49 ప్రాణాలు కోల్పోయారు.
వివిధ రాష్ట్రాల్లో కరోనా కొత్త కేసులు..
- తమిళనాడులో కొత్తగా 1,630 కేసులు నమోదయ్యాయి. 1,643 మంది కోలుకోగా, 17 మంది మృతి చెందారు.
- మిజోరంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అక్కడ కొత్తగా 1,380 మంది కరోనా బారిన పడ్డారు. మరో ముగ్గురు వైరస్‌కు బలయ్యారు.
- కర్ణాటకలో కొత్తగా 539 కేసులు నమోదు కాగా.. 591 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 17 మంది మరణించారు.
- ఒడిశాలో కొత్తగా 565 కేసులు నమోదయ్యాయి. మరో ఐదుగురు వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.
- గోవాలో కొత్త 83 మందికి కరోనా సోకింది. నలుగురు వైరస్ కారణంగా మరణించారు.
దేశ రాజధాని దిల్లీలో కొత్తగా 41 మందికి వైరస్ సోకగా.. వైరస్ కారణంగా ఎవరూ మరణించలేదు.
వ్యాక్సినేషన్..
దేశంలో కొవిడ్ టీకా పంపిణీ ప్రక్రియ(Vaccination Status In India) కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా బుధవారం వరకు పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 88 కోట్లు దాటిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా 59,48,118 డోసులు పంపిణీ చేసినట్లు చెప్పింది.
ఇవీ చూడండి: