ETV Bharat / bharat

కేరళలో మంగళవారం తొలిదఫా 'స్థానిక' పోరు

author img

By

Published : Dec 7, 2020, 8:11 PM IST

Updated : Dec 7, 2020, 9:26 PM IST

కేరళలో స్థానిక ఎన్నికల తొలి విడత పోలింగ్​ మంగళవారం జరగనుంది. మొత్తం ఐదు దక్షిణాది జిల్లాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు అధికారులు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ ఎన్నికలకు అన్ని చర్యలు చేపట్టినట్టు తెలిపారు.

Kerala civic polls phase I: 24,584 in fray on Tuesday
కేరళలో రేపే తొలిదఫా స్థానిక పోరు- 24వేల మంది పోటీ

కేరళలో స్థానిక సమరానికి రంగం సిద్ధమైంది. మూడు దశల్లో నిర్వహించనున్న ఈ ఎన్నికల్లో భాగంగా.. తొలిదశ పోలింగ్​ మంగళవారం జరగనుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్​ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఐదు దక్షిణాది జిల్లాల(తిరువనంతపురం, కొల్లాం, పతనమిట్ట, అలప్పుజ, ఇడుక్కి)లో జరిగే ఈ పోలింగ్​కు 11,225 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియలో 56,122 మంది అధికారులు పాల్గొననున్నారు. ఎన్నికల సిబ్బంది సోమవారం ఉదయం పోలింగ్​ సామగ్రిని ఆయా కేంద్రాలకు తరలించింది.

తొలిదశ పోలింగ్​లో మొత్తం 24,584 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 41,58,341 మంది పురుషులు; 46,68,209 మంది స్త్రీలు సహా.. 70 మంది ట్రాన్స్​జెండర్లు ఈ దఫా ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ప్రచారానికి దూరంగా సీఎం

సీపీఐ-ఎం నేతృత్వంలోని వామపక్షాలు; కాంగ్రెస్​ అధ్వర్యంలోని యూడీఎఫ్​; భాజపా సారథ్యంలోని ఎన్డీఏ ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2015లో జరిగిన స్థానిక పోరులో వామపక్షాలు 60శాతం స్థానాల్లో గెలుపొందగా.. కాంగ్రెస్​ ఆ తర్వాతి స్థానం దక్కించుకుంది. 21వేల సీట్లల్లో భాజపా కేవలం 1,200 స్థానాలకే పరిమితమైంది.

కొవిడ్​, ఇతర కారణాల వల్ల.. ఈ ఎన్నికల ప్రచారానికి రాష్ట్ర సీఎం పినరయి విజయన్​ దూరమయ్యారు.

ఇదీ చదవండి: నాడు జవాన్​ను కాపాడింది.. నేడు రాజకీయాల్లోకి వస్తోంది

Last Updated : Dec 7, 2020, 9:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.