ETV Bharat / bharat

'రోడ్డు పాడైపోయిందా?.. నేరుగా కాంట్రాక్టర్​నే ప్రశ్నించండి' - కేరళ మంత్రి రియాజ్

Kerala Cherrapunji: రోడ్ల సమస్యకు చెక్​ పెట్టేందుకు సంబంధిత కాంట్రాక్టర్​ వివరాలను ప్రజలకు అందుబాటులోకి తేనుంది కేరళ ప్రభుత్వం. ఇకనుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా రోడ్లు సరిగా లేకుంటే కాంట్రాక్టర్లను ప్రశ్నించవచ్చని పేర్కొంది.

road
రోడ్డు సమస్యా? ఇదిగో కాంట్రాక్టర్లకు ఫోన్​ చేసి అడగండి : మంత్రి
author img

By

Published : Dec 4, 2021, 8:03 PM IST

Kerala Cherrapunji: రోడ్డు సమస్యలు మరింత సులువుగా పరిష్కారం అయ్యేందుకు కేరళ ప్రభుత్వం ఓ వినూత్న ప్రయత్నం చేసింది. రోడ్డు సమస్యలపై ప్రజలే నేరుగా కాంట్రాక్టర్లను ప్రశ్నించేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇందులో భాగంగా కాంట్రాక్టర్ల వివరాలను ప్రజలకు అందుబాటులోకి తేనుంది. ఈ కార్యక్రమం మంత్రి పీఏ మహమ్మద్​ రియాజ్​ ఆధ్వర్యంలో శనివారం ప్రారంభమైంది. అయితే ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నటుడు జయసూర్య ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

'అలా అయితే అక్కడ రోడ్లే ఉండవు'

'రోడ్లు పాడవడానికి వర్షాలే కారణమంటే ప్రజలు సహించరు. అదే నిజమైతే చిరపుంజిలో (దేశంలో ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే ప్రాంతం) అసలు రోడ్లే ఉండవు' అని జయసూర్య అన్నారు. ఈ సందర్భంగా అసలు నాణ్యతలేని రోడ్లపై ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని మంత్రిని ప్రశ్నించారు.

దీనిపై స్పందించిన మంత్రి రియాజ్​.. కాంట్రాక్టరే అందుకు బాధ్యుడు అని స్పష్టం చేశారు. రోడ్ల పరిస్థితులను గమనించి కాంట్రాక్టర్లు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తూ ఉండాలని తెలిపారు.

ఇదీ చూడండి : కేంద్రంతో చర్చలకు రైతులు సిద్ధం- కేసులు ఎత్తివేసే వరకు నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.