Kerala Blast Today : కేరళ కలమస్సేరిలోని కన్వెన్షన్ సెంటర్లో జరిగిన భారీ వరుస పేలుళ్ల ఘటనలో దర్యాప్తును ముమ్మరం చేశారు అధికారులు. ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కూడా రంగంలోకి దిగగా.. పేలుడుకు తనదే బాధ్యతను ఒక వ్యక్తి లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. డొమినిక్ మార్టిన్ అనే వ్యక్తి సాక్ష్యాలతో పాటు వచ్చి త్రిస్సూర్‌లోని కొడకర పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు శాంతిభద్రతల డీజీపీ ఎమ్ఆర్ అజిత్ కుమార్ తెలిపారు. ఇతడు క్రైస్తవ మతానికి చెందిన జెహోవా వర్గం వ్యక్తేనని చెప్పుకున్నాడని.. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నామని డీజీపీ చెప్పారు.
మరోవైపు లొంగిపోవడానికి ముందు మార్టిన్ ఫేస్బుక్లో ఓ వీడియోను సైతం పోస్ట్ చేశాడు. చిన్నారుల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే ద్రోహులు అంటూ జెహోవా విట్నెసెస్ గురించి ఇందులో మాట్లాడాడు. వారందరూ మనుషులకు కీడును కోరుకుంటున్నారని.. దీనిని మార్చుకోవాలని 16 ఏళ్లుగా చెప్పానని, కానీ వాళ్లు వినలేదని అన్నాడు.
దర్యాప్తులో ఆ బ్లూ కారు కీలకం!
మరోవైపు ఘటనా స్థలానికి చేరుకున్న NIA అధికారులు.. పోలీసులతో కలిసి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజీని తీసుకున్నారు. అయితే, ఈ దర్యాప్తులో ఓ బ్లూ కారు కీలకంగా మారింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో నీలం రంగు కారు అనుమానాస్పదంగా సంచరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న ఓ మతపరమైన కార్యక్రమానికి భక్తులు రాకముందే.. కారు అక్కడికి వచ్చిందని అధికారులు గుర్తించారు. కానీ, పేలుడు జరగడానికి కొద్ది సమయం ముందే అక్కడి కారు అక్కడి నుంచి వెళ్లడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఈ క్రమంలోనే పేలుడుకు సంబంధించిన నిందితుడు ఈ కారులోనే వచ్చాడని అనుమానిస్తున్నారు అధికారులు. అయితే, ఈ కారుకు సంబంధించిన వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. మరికొందరు సాక్షులు మాత్రం.. ఓ వ్యక్తి బ్యాగును పట్టుకుని హాల్ ప్రాంగణంలోనే తిరిగినట్లు చెబుతున్నారు.
"నేను ప్రార్థన చేస్తూ కళ్లు మూసుకున్నాను. భారీ పేలుడు శబ్దం వినిపించడం వల్ల నా కళ్లు తెరిచాను. ఓ భారీ అగ్నిగుండం నా కళ్లు ముందు ఉంది. హాల్ మొత్తం మంటలు తప్ప మరేమీ కనిపించలేదు. అందరూ హాహాకారాలు చేస్తూ బయటకు పరుగులు తీశారు."
--ప్రత్యక్ష సాక్షి
"నేను హాల్లో కళ్లు మూసుకుని ప్రార్థన చేస్తున్నాను. నా సమీపంలో ఒక్కసారిగా ఓ భారీ పేలుడు జరిగింది. కళ్లు తెరిచి చూసేసరికి చుట్టూ మంటలు ఉన్నాయి. అందరూ పరుగెడుతుండగా.. వారితో నేను బయటకు వచ్చాను. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ప్రార్థనల కోసం వస్తున్నాను. కానీ ఇంతకుముందు ఎప్పుడూ ఇలా జరగలేదు."
--ప్రత్యక్ష సాక్షి
అఖిలపక్ష సమావేశం ఏర్పాటు
వరుస పేలుళ్ల నేపధ్యంలో కేరళ సర్కార్ అప్రమత్తం అయ్యింది. ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి పినరయి విజయన్. సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర సచివాలయంలోని ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్ హాల్లో జరిగే సమావేశానికి అన్ని పార్టీల ప్రతినిధులు హాజరుకావాలని సీఎంఓ కోరింది.
మరోవైపు.. ఇప్పటివరకు వివిధ ఆస్పత్రులల్లో మొత్తం 52 మంది క్షతగాత్రులు చేరినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో 30 మంది చేరారని.. ఇందులో 18 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని.. అందులో ఒకరు 12 ఏళ్ల బాలుడు ఉన్నాడని చెప్పారు. మిగిలిన వారు వివిధ ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని వివరించారు. అయితే, మరణించిన వ్యక్తి ఎవరనేది ఇంకా గుర్తించలేదని చెప్పారు.
-
#WATCH | On explosion at the Convention Centre in Kalamassery, Kerala Health Minister Veena George says, "52 people admitted to different hospitals…30 people are admitted here, out of which 18 are in ICU and 6 are critically injured, among those 6, one is a 12-year-old child.… pic.twitter.com/bBnummC4Na
— ANI (@ANI) October 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | On explosion at the Convention Centre in Kalamassery, Kerala Health Minister Veena George says, "52 people admitted to different hospitals…30 people are admitted here, out of which 18 are in ICU and 6 are critically injured, among those 6, one is a 12-year-old child.… pic.twitter.com/bBnummC4Na
— ANI (@ANI) October 29, 2023#WATCH | On explosion at the Convention Centre in Kalamassery, Kerala Health Minister Veena George says, "52 people admitted to different hospitals…30 people are admitted here, out of which 18 are in ICU and 6 are critically injured, among those 6, one is a 12-year-old child.… pic.twitter.com/bBnummC4Na
— ANI (@ANI) October 29, 2023
ఉత్తర్‌ప్రదేశ్ అప్రమత్తం.. వారికి కీలక ఆదేశాలు
కేరళలో జరిగిన వరుస పేలుళ్ల నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలంటూ అన్ని జిల్లాల అధికారులను ఆదేశించింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి సంబంధించిన కార్యక్రమాలపైనా దృష్టి సారించాలని చెప్పింది. కాన్పూర్, మేరఠ్, అలీగఢ్, లఖ్‌నవూ, వారణాసి తదితర జిల్లాల్లో ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది.
పేలుళ్ల కలకలం
కేరళలోని కోచి సమీపంలో ఉండే కలమస్సెరి ప్రాంతంలో క్రిస్టియన్ సంఘానికి చెందిన జమరా ఇంటర్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం ఉదయం వరుస పేలుళ్లు జరిగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో 52 మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి కన్వెన్షన్ సెంటర్‌లో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. కుర్చీలు మంటల్లో కాలిపోయాయి. కన్వెన్షన్ సెంటర్‌లో క్రైస్తవులు ఆదివారం ప్రార్థనలు చేస్తున్న సమయంలో మొదటి పేలుడు సంభవించిందని.. ఆ తర్వాత మరో రెండు పేలుళ్లు జరిగాయని ఆ సమయంలో లోపలే ఉన్న వృద్ధురాలు తెలిపింది. మొత్తం మూడు పేలుళ్ల జరగ్గా రెండు శక్తిమంతమైనవని పోలీసు వర్గాలు వెల్లడించాయి. పేలుడు జరిగిన సమయంలో కన్వెన్షన్ సెంటర్లో 2వేల మంది ఉన్నట్లు అక్కడే ఉన్న మరో వ్యక్తి తెలిపారు. పేలుడు జరిగిన వెంటనే లోపల ఉన్నవారు భయంతో బయటకు పరుగులు తీశారు. కొందరు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.
Kerala Blast Today : 'పేలుడుకు కారణం ఐఈడీనే.. సిట్‌తో దర్యాప్తు'.. కేరళకు NSG బృందం
Kerala Blast Today : కన్వెన్షన్ సెంటర్లో భారీ పేలుడు.. అనేక మందికి గాయాలు.. ఉగ్రదాడి?