Kerala Blast Today : కేరళలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో భారీ పేలుడు సంభవించి ఒకరు మరణించారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 36 మంది గాయపడ్డారు. వీరిలో పది మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎర్నాకులంలోని కాళామస్సేరీలో ఉన్న జమ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. 2000వేల మందికిపైగా పాల్గొన్న ఓ మతపరమైన కార్యక్రమం జరుగుతున్న సమయంలో పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. ఇందుకు ఐఈడీ ఉపయోగించారని వెల్లడించారు.
పేలుడుకు సంబంధించి ఆదివారం ఉదయం 9.40 గంటల ప్రాంతంలో తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు వారు వెల్లడించారు. కన్వెన్షన్ సెంటర్ నుంచి హుటాహుటిన ప్రజలను బయటకు పంపించినట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనలో ఓ మహిళ చనిపోయిందని తెలిపారు.
కన్వెన్షన్ హాల్లో మూడు నుంచి నాలుగు చోట్ల పేలుళ్ల జరిగాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. చుట్టుపక్కల మండలాలైన వరపుజ, అంగమలి, ఎడపల్లి నుంచి భారీ సంఖ్యలో వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రార్థనా సమయంలో వీరంతా కళ్లు మూసుకొని ఉండగా.. హాలు మధ్యలో భారీ పేలుడు జరిగినట్లు చెప్పారు. అనంతరం మరో రెండు మూడు చిన్న పేలుళ్లు జరిగాయని వెల్లడించారు. ఈ కన్వెన్షన్ సెంటర్ లోపలి వైపు నుంచి తాళం వేసి ఉండటం వల్ల క్షతగాత్రులను తరలించడంలో కొంత జాప్యం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ పేలుళ్లలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయినట్లు సమచాారం.
-
It's a very unfortunate incident. We are collecting details regarding the incident. All top officials are there in Ernakulam. DGP is moving to the spot. We are taking it very seriously. I have spoken to DGP. We need to get more details after the investigation: Kerala CM Pinarayi… https://t.co/4utwtmR9Sl pic.twitter.com/GHwfwieRLB
— ANI (@ANI) October 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">It's a very unfortunate incident. We are collecting details regarding the incident. All top officials are there in Ernakulam. DGP is moving to the spot. We are taking it very seriously. I have spoken to DGP. We need to get more details after the investigation: Kerala CM Pinarayi… https://t.co/4utwtmR9Sl pic.twitter.com/GHwfwieRLB
— ANI (@ANI) October 29, 2023It's a very unfortunate incident. We are collecting details regarding the incident. All top officials are there in Ernakulam. DGP is moving to the spot. We are taking it very seriously. I have spoken to DGP. We need to get more details after the investigation: Kerala CM Pinarayi… https://t.co/4utwtmR9Sl pic.twitter.com/GHwfwieRLB
— ANI (@ANI) October 29, 2023
ఘటనలో కొంతమంది తీవ్రంగా గాయపడ్డారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి పి రాజీవ్ తెలిపారు. వారందరికి కాళామస్సేరీ మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అవసరమైతే వారిని వేరే ఆస్పత్రికి తరలిస్తామని వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులును ఆదేశించారు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్.
ఘటన చాలా దురదృష్టకరం : కేరళ ముఖ్యమంత్రి
ఈ ఘటనపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. ఇది చాలా దురదృష్టకరమన్నారు. దీనికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఘటనపై దర్యాప్తు జరపాలని అధికారులు ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. మరోవైపు, పేలుడు ఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆరా తీశారు. సీఎం విజయన్‌కు ఫోన్ చేసి మాట్లాడారు.
ఐఈడీ దాడి..
పేలుడు కోసం ఐఈడీ వాడినట్లు ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చినట్లు కేరళ డీజీపీ షేక్ దర్వేష్ సాహెబ్ తెలిపారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. అయితే పేలుడు వల్ల మహిళ మృతి చెందలేదని.. మంటలు అంటుకుని చనిపోయిందని కేరళ మంత్రి వీఎన్ వాసవన్ తెలిపారు.
-
#WATCH | Kerala DGP Dr Shaik Darvesh Saheb says "Today morning at 9:40 am approximately there was an explosion at Zamra International Convention & Exhibition Centre in which one person died and 36 persons are undergoing treatment. In the convention centre, Jehovah’s Witnesses… pic.twitter.com/BoK4gBPT5x
— ANI (@ANI) October 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Kerala DGP Dr Shaik Darvesh Saheb says "Today morning at 9:40 am approximately there was an explosion at Zamra International Convention & Exhibition Centre in which one person died and 36 persons are undergoing treatment. In the convention centre, Jehovah’s Witnesses… pic.twitter.com/BoK4gBPT5x
— ANI (@ANI) October 29, 2023#WATCH | Kerala DGP Dr Shaik Darvesh Saheb says "Today morning at 9:40 am approximately there was an explosion at Zamra International Convention & Exhibition Centre in which one person died and 36 persons are undergoing treatment. In the convention centre, Jehovah’s Witnesses… pic.twitter.com/BoK4gBPT5x
— ANI (@ANI) October 29, 2023
Rajasthan Accident News : ఒకే కుటుంబంలోని ఏడుగురు మృతి.. ఫంక్షన్ నుంచి వస్తుండగా..
Family Mass Suicide : ఒకే కుటుంబంలో ఏడుగురు సామూహిక ఆత్మహత్య.. ఆరుగురికి విషం ఇచ్చి.. ఆపై..