ETV Bharat / bharat

కేరళకు స్టార్​ ప్రచారకుల క్యూ

author img

By

Published : Mar 21, 2021, 10:51 AM IST

జాతీయ స్థాయి నేతల ప్రచారాలు, వరుస ర్యాలీలతో కేరళలో రాజకీయ వేడి పెరిగిపోనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా కేంద్ర మంత్రులు, ఇరు పార్టీల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖ నేతలు రాష్ట్రంలో పర్యటించనున్నారు.

Kerala Assembly Elections April 2021: Kerala awaits star campaigners!
స్టార్ ప్రచారకులతో మార్మోగిపోనున్న కేరళ రాజకీయం

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కేరళ రాజకీయం స్టార్​ ప్రచారకులతో హోరెత్తిపోనుంది. జాతీయ స్థాయి నేతలు, సినీ తారలతో క్యాంపెయినింగ్ కళకళలాడనుంది. భాజపా తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు రాష్ట్రానికి రానున్నారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపడం సహా.. ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా పర్యటించనున్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, వామపక్షాల తరఫున సీతారాం ఏచూరి కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొననున్నారు.

రాహుల్, ఏచూరి తొలుత కేరళలో అడుగుపెట్టనున్నారు. మార్చి 23 ఎర్నాకుళం, కొట్టాయం, త్రిస్సూర్ జిల్లాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో రాహుల్ పాల్గొంటారు. అదే రోజు రాష్ట్రానికి రానున్న ఏచూరి.. మార్చి 28 వరకు వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేయనున్నారు. లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్​డీఎఫ్) క్యాంపెయిన్​ను ముందుండి నడిపించనున్నారు.

మార్చి 30న మోదీ

ప్రధాని మోదీ రెండు సార్లు రాష్ట్రానికి రానున్నట్లు తెలుస్తోంది. మార్చి 30, ఏప్రిల్ 1న ప్రచారాన్ని చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. మార్చి 24, 25, ఏప్రిల్ 3 తేదీల్లో రాష్ట్రంలో పర్యటిస్తారు. వివిధ నియోజకవర్గాల్లో ఎన్​డీఏ తరఫున బరిలో ఉన్న అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తారు. మార్చి 27, ఏప్రిల్ 1 తేదీల్లో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

ప్రముఖ నటి, భాజపా నేత విజయశాంతి సైతం కేరళ ప్రచారాన్ని పరుగులు పెట్టించనున్నారు. మార్చి 21 నుంచి జరిగే ఎన్​డీఏ ప్రచార సభల్లో ఆమె పాల్గొంటారు. వారం పాటు ఆమె ప్రచార కార్యక్రమాలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు కేంద్ర మంత్రులు రాజ్​నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, భాజపా ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, శివరాజ్ సింగ్ చౌహాన్, బిప్లవ్ కుమార్ దేవ్ సైతం కేరళ ఎన్నికల కదనరంగంలో కాలు కదపనున్నారు.

ప్రియాంక రాక?

కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) ప్రచారంలో పాల్గొనేందుకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ రాష్ట్రానికి రానున్నట్లు తెలుస్తోంది. తేదీలు ఇంకా ఖరారు కానప్పటికీ.. ప్రచారంలో ఆమె పాల్గొనడం మాత్రం ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మార్చి 22 తర్వాత ఆమె పర్యటన ఉండే అవకాశం ఉందని వెల్లడించాయి. మూడు దశలుగా రాష్ట్రంలో ప్రియాంక పర్యటిస్తారని స్పష్టం చేస్తున్నాయి.

ఇక, వివిధ రాష్ట్రాల్లోని విపక్ష పార్టీల నేతలు సైతం కేరళలో పర్యటించనున్నారు. సమాజ్​వాదీ అఖిలేశ్ యాదవ్, బిహార్ విపక్ష నేత తేజస్వీ యాదవ్, కాంగ్రెస్ ప్రముఖులు గులామ్ నబీ ఆజాద్, సచిన్ పైలెట్, రాజ్యసభ విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, ముఖ్యమంత్రులు అశోక్ గహ్లోత్, అమరీందర్ సింగ్, భూపేశ్ బఘేల్ సైతం యూడీఎఫ్ తరఫున ప్రచారం చేయనున్నారు.

లెఫ్ట్​ కోసం కన్నయ్య...

కేరళలో లెఫ్ట్ కూటమి తరఫున సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా ప్రచారం చేయనున్నారు. మార్చి 25 నుంచి 28 వరకు ఆయన ప్రచారం కొనసాగనుంది. సీపీఐ స్టార్ ప్రచారకుడు, జేఎన్​యూ మాజీ విద్యార్థి నేత కన్నయ్య కుమార్​ సైతం ఎల్​డీఎఫ్ తరఫున రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు. మార్చి 31, ఏప్రిల్ 1న ఆయన ప్రచార సభల్లో పాల్గొననున్నారు. వీరితో పాటు, ప్రకాశ్ కారాట్, బృందా కారాట్, సుభాషిణీ అలీ, అమర్జీత్ కౌర్ వంటి ప్రముఖులు ఎల్​డీఎఫ్ తరఫున ప్రచారం చేయనున్నారు.

ఇలా.. జాతీయ స్థాయి నేతల వరుస ప్రచార కార్యక్రమాలతో కేరళ రాజకీయం విమర్శలు, ప్రతివిమర్శలతో జోరుగా సాగిపోనుంది.

కేరళ అసెంబ్లీకి ఏప్రిల్ 6న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.