కేరళలోని సంప్రదాయ నృత్య రూపం తెయ్యం(Theyyam Dance). తెయ్యం ఆకృతిని (Theyyam Art) బేకరీ వస్తువులతో రూపొందించి ఆకట్టుకుంటున్నారు సురేశ్ అనే కళాకారుడు. అతడిది కేరళనే. 'ద వించి' సురేశ్‌గా బాగా ప్రసిద్ధి.
ఈ కళాఖండాన్ని కన్నూర్‌లో (Theyyam Kannur) ఉన్న బేక్స్టోరీ అనే బేకరీలోని హాల్లో రూపొందించారు సురేశ్. అందుకోసం పలు రకాల రంగులు, సైజుల్లో ఉన్న 25వేల బిస్కెట్లు, ఇతర బేకరీ ఉత్పత్తులను వినియోగించారు.
![theyyam art](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13325890_111.jpg)
"ఈ కళా రూపాన్ని బేక్ స్టోరీ అనే బేకరీలో రూపొందించాను. ఇది 24 అడుగుల పొడవు ఉంది. దీనిని పూర్తి చేయడానికి 15 గంటల సమయం పట్టింది. బేకరిలోని స్నేహితులు దానిని పూర్తి చేయడంలో సహకరించారు."
-సురేశ్, కళాకారుడు
తన బేకరీలో ఈ కళాకృతిని (Theyyam Art) రూపొందించమని సురేశ్‌ను బేక్ స్టోరీ చెఫ్ మహ్మద్ రషీద్ ఆహ్వానించారు. ప్రదర్శన అయ్యాక ఈ బేకరీ ఉత్పత్తులను బయోడీగ్రేడింగ్ కోసం వెటర్నరీ ఫార్మ్‌కు ఇచ్చేశారు.
ఇదీ చూడండి: నవంబరు 16న తెరుచుకోనున్న శబరిమల ఆలయం